R Ashwin: అశ్విన్‌ను అవమానించారు.. రోహిత్, గంభీర్‌పై మాజీలు ఫైర్!

రవిచంద్రన్‌ అశ్విన్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌ వాతావరణం సరిగా లేదంటూ రోహిత్, గంభీర్‌పై మాజీలు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నెం1 బౌలర్‌ను అవమానించారని మండిపడుతున్నారు.  

New Update
ashwin rohit

అశ్విన్, రోహిత్, గంభీర్

R Ashwin: భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించడంపై భారీ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరో రెండు టెస్టులు మిగిలుండగానే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై పలువురు మాజీలు టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌ వాతావరణంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. లెజెండ్ స్పిన్నర్‌గా గుర్తింపు సంపాదించుకున్న అశ్విన్‌ను దారుణంగా అవమానించారని, కనీసం వీడ్కోలు కూడా ఘనంగా దక్కకుండా చేశారంటూ మండిపడుతున్నారు. అశ్విన్ విషయంలో ద్వంద ప్రమాణాలు పాటించారంటూ కెప్టె్న్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. 

తగినంత గుర్తింపు దక్కలేదు..


ఈ మేరకు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ గురించి మాట్లాడిన సునీల్ గావస్కర్.. భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రెండు రకాల పద్ధతులు పాటిస్తోందన్నారు. అశ్విన్ విషయంలోనూ ఇదే జరిగింది. టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌లు సాధించిన అశ్విన్‌కు ఆల్‌రౌండర్‌గా తగినంత గుర్తింపు దక్కలేదు. టీమ్ సమతూకం పేరుతో ప్లేయింగ్‌ ఎలెవన్‌లో అతనికి చోటు ఇవ్వలేదు. ప్రస్తుత క్రికెట్ బ్యాటర్ల గేమ్‌గా మారింది. స్వదేశంలో మ్యాచ్‌లు జరిగినప్పుడు అశ్విన్‌ను పక్కనపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అశ్విన్ లేకుండా మ్యాచ్‌ గెలవలేరని మేనేజ్‌మెంట్‌కు తెలుసు. ఐసీసీ నంబర్‌ వన్ ర్యాంకు బౌలర్‌కు పిచ్‌, పరిస్థితులు సరిపోవని సాకుగా చూపించి తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. అలాంటి పిచ్‌లు, పరిస్థితుల్లో ఇబ్బందిపడే బ్యాటర్ల విషయంలో ఈ షరతు వర్తించలేదు. టీమ్‌ఇండియాకు అశ్విన్ మంచి కెప్టెన్‌గా ఉండేవాడు. కానీ, అతనికి వైస్ కెప్టెన్ అనే గౌరవం కూడా దక్కలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ప్రభాకర్ అరెస్ట్.. వందల్లో నేరాలు!

వీడ్కోలు ఘనంగా జరగాల్సింది..


భారత క్రికెట్‌కు అశ్విన్ లాంటి వ్యక్తి అరుదుగా దొరుకుతారని కపిల్ దేవ్ అన్నారు. భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే అభిమానులకు మరింత ఆనందంగా ఉండేదన్నారు. అశ్విన్ ముఖంలో ఆవేదన కనిపించడం నన్ను కలచివేసింది. అతను ఓ ఛాంపియన్ ఆటగాడు. కెప్టెన్ నమ్మే బౌలర్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అశ్విన్ ఆటతీరు, అతని ప్రయోగాలు టీమిండియా విజయాల్లో కీలకమయ్యాయి. అన్ని ఫార్మాట్లలోనూ ప్రతిభను చాటాడు. అశ్విన్, ప్రత్యేకించి టెస్టు క్రికెట్‌లో మైలురాళ్లను సాధించాడు. 37 సార్లు 5 వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు తీసిన ఘనత అతనిదే. బౌలింగ్‌తో పాటు కీలక సందర్భాల్లో బ్యాటింగ్‌తోనూ టీమిండియాకు విజయాలను అందించాడు. భారత క్రికెట్‌లో మరో శకం ముగిసినట్లైంది. అతనికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సింది. కానీ అలా జరగకపోవడం బాధాకరం అన్నారు. 

బౌలింగ్ ఇంజనీర్..


2020 ఐపీఎల్ నుంచి అశ్విన్ మంచి ఫామ్‌లో ఉన్నాడని మహ్మద్ కైఫ్ అన్నాడు. అతడు కొత్త బాల్ తో బౌలింగ్ పవర్ ప్లేలో వికెట్లు పడగొట్టడంలో గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తాడన్నారు. ఇక ఇంగ్లాండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ సైతం అశ్విన్ పై ప్రశంసలు కురిపించాడు. స్పిన్ బౌలింగ్ లో అశ్విన్ ఇంజనీర్ అంటూ పొగిడేశాడు. బంతి యాంగిల్ ను మార్చుతూ, విభిన్న బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టిస్తాడంటూ కొనియాడాడు. తొలిసారి 2012లో అశ్విన్ ఆటను చూశానని, బౌలింగ్ విధానం చూసి గొప్ప బౌలర్ అవుతాడని అప్పుడే అనిపించిందని చెప్పాడు. 'స్పిన్ బౌలింగ్ లో ఇంజనీర్' అంటూ ప్రశంసించాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు