WTC Final: ముగిసిన మూడో రోజు ఆట..విజయం దిశగా సౌత్ ఆఫ్రికా

సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 213/2 స్కోరుతో ఉంది. మరో 69 పరుగులు చేస్తే ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.

New Update
WTC

Mrkaram Century, WTC Final

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మూడో రోజు కొద్ద సేపటి క్రితమే ముగిసింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 282 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా దూకుడుగా ఆడుతోంది. 35 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌ (6) కీపర్‌ అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం జట్టు స్కోకు 70 పరుగుల వద్ద మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లోనే లబుషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి వియాన్‌ మల్డర్ (27) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత నుంచి ఐడెన్ మార్క్రమ్, కెప్టెన్ బవుమాలు దంచి కొడుతున్నారు. ఈ క్రమంలో మార్క్రమ్ సెంచరీ చేసి 102 పరుగులతో బరిలో ఉన్నాడు. మరోవైపు బవుమా కూడా 65 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. మరో 69 పరుగులు చేస్తే డబ్ల్యూటీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా సొంతం అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి చూస్తే ప్రొటీస్ దీన్ని ఈజీగా సాధిస్తుంది తెలుస్తుంది. ఆ జట్టు చేతిలో ఇంకా రెండో రోజులు ఉన్నాయి. దాంతో పాటూ ఎనిమిది వికెట్లు కూడా మిగిలే ఉన్నాయి. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు.

బౌలర్లకు అనుకూలంగా పిచ్..

లార్డ్స్ లో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో అంతకు ముందు ఆస్ట్రేలియా రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మూడో రోజు మరో 63 పరుగులు జోడించి.. తర్వాత 207 రన్స్‌కు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇక్కడి పిచ్ బౌలర్లకు బాగా అనుకూలిస్తుండడంతో పెద్దగా పరుగులు చేయడం అవ్వడం లేదు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద షాక్ తగిలింది. స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. స్టార్క్ బౌలింగ్ లో బవుమా ఇచ్చిన క్యాచ్ పడుతుండగా స్లిప్ లో ఫీల్డంగ్ చేస్తున్న అతని కుడి చేతికి చిటికెన వేలు విరిగింది. ప్రాథమిక చికిత్స తర్వాత స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు