/rtv/media/media_files/2025/07/31/gill-2025-07-31-18-34-27.jpg)
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ భారత క్రికెట్ ను ఒక మలుపు తిప్పింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, జడేజా ల్లాంటి వాళ్ళు వెళిపోయాక జట్టు ఏమైపోతుందో అని అందరూ భయపడ్డారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ భారత్ కు ఇంక లేనట్టే అనుకున్నారు. కానీ శుభ్ మన్ గిల్ సారధ్యంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ లో కుర్రాళ్ళ జట్టు అద్భుతంగా ఆడేసింది. మొత్తం ఐదు మ్యాచ్ ల సీరీస్ ను 2-2తో సమం చేసింది. కొన్ని మ్యాచ్ లలో ఓడిపోయి తడబడినా..చివరి మ్యాచ్ లో సూపర్ గా పుంజుకుని సీరీస్ ను సమయం చేసింది. దాదాపు అందరు ఆటగాళ్ళూ తమ ప్రతిభను కనబరిచారు. గాయాలు తగిలినా చెక్కుచెదరకుండా ఆడారు. గిల్, పంత్, రాహుల్, సిరాజ్ అందరూ తమ పత్తా నిరూపించుకున్నారు. కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఆహా అనిపించుకున్నాడు. దీంతో ప్రస్తుతం భారత జట్టు అందరి ఫేవరెట్ గా మారింది.
సత్తా నిరూపించుకున్న కెప్టెన్ గిల్..
ఈ సీరీస్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్ళ క్రేజీ ఒక లెవల్లో పెరిగిపోయింది. దీనికి నిదర్శనంగా తాజాగా జరిగిన వేలం. ఇందులో ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లో ఆడిన క్రికెటర్ల జెర్సీలను వేలం వేశారు. అందరివీ ఎక్కువ ధరలకు అమ్ముడుబోయాయి. అందరి కంటే ఎక్కువ కెప్టెన్ గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది. 2-2తో డ్రాగా ముగిసిన 5 టెస్టుల సిరీస్‌లో శుభ్‌మన్ ఒక డబుల్ సెంచరీ, 3 సెంచరీలతో 754 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద సీరీస్ గా నిలిచాడు. ఈ సీరీస్ లో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ధరించిన జెర్సీలు, టోపీలను రెడ్‌రూత్ స్పెషల్ టైమ్డ్ వేలంలో గిల్ తర్వాత జడేజా, బుమ్రా జెర్సీలు రూ. 494 లక్షలకు చొప్పున..రిషబ్ పంత్ జెర్సీ రూ.4 లక్సలు పలికాయి. ఇంగ్లాండ్ ప్లేయర్లలో జో రూట్ రూ. 4.47 లక్సలు, బెన్ స్టోక్స్ రూ.4 లక్షలకు అమ్ముడుబోయాయి. ఈ వేలం ద్వారా లభించిన మొత్తాన్ని రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కు అందజేయనున్నారు.