/rtv/media/media_files/2025/05/07/txvWtZH0LPKGujtljAfD.jpg)
Rohit Sharma retirement announce from Test cricket
Rohit Sharma Retirement: భారత సారథి రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టులనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టిన రోహిత్.. 67 టెస్టులాడి 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలుండగా 212 అత్యధిక స్కోర్.
— Rohit Sharma (@ImRo45) October 1, 2024
ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్..
ఈ మేరకు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త నాయకుడితో వెళ్లాలని జాతీయ సెలెక్టర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించానున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ విషయం ముందుగానే గమనించిన రోహిత్ టెస్టుల నుంచి పూర్తిగా తప్పుకంటున్నట్లు అనౌన్స్ చేశాడు. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటికే T20లకు వీడ్కోలు పలకగా ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు.
భారత టెస్ట్ జట్టులో రోహిత్ భవిష్యత్తుపై సెలెక్టర్లు గత నెలలో వరుస చర్చలు జరిపారు. మంగళవారం ముంబైలో ఈ అంశంపై చర్చించారు. సెలెక్టర్ల ఆలోచన విధానం స్పష్టంగా ఉంది. వారు ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త నాయకుడిని కోరుకుంటున్నారు. రోహిత్ కెప్టెన్‌గా సరిపోడు. ముఖ్యంగా అతని రెడ్-బాల్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే కష్టమే అనిపిస్తోంది. టెస్ట్ సైకిల్‌కు యువ నాయకుడిని తయారు చేయాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఇకపై రోహిత్ టెస్టు జట్టుకు నాయకత్వం వహించడని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మెంబర్ మీడియాక వెల్లడించినట్లు సమాచారం.
rohit-sharma | cricket | india Short News