Rohit Sharma : నీ యవ్వ తగ్గేదేలే.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక్కడు

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు

New Update
rohit

అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్నరెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. భారత ఇన్నింగ్స్‌లోని మూడవ ఓవర్ ఐదవ బంతికి మిచెల్ స్టార్క్‌ వేసిన బంతిని ఫోర్ కొట్టడం ద్వారా రోహిత్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అడిలైడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్, ఆస్ట్రేలియాలో ఆసీస్‌తో రోహిత్ ఆడుతున్న 21వ వన్డే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో, రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, స్టీవ్ స్మిత్ ఉన్నారు. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉంది. రిచర్డ్స్ ఆస్ట్రేలియాతో వారి దేశంలో 40 వన్డేలు ఆడి మొత్తం 1905 పరుగులు సాధించాడు.

రోహిత్ 174 పరుగులు చేస్తే

అతని తర్వాత మరో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డెస్మండ్ హేన్స్, శ్రీలంక ద్వయం కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే ఉన్నారు. కాగా ఈ సిరీస్‌లో రోహిత్ 174 పరుగులు చేస్తే..  సంగక్కరను కూడా అధిగమించగలడు. కాగా ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మన్ రికార్డు టెండూల్కర్ పేరిట ఉంది. ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్ 47 మ్యాచ్‌ల్లో 1491 పరుగులతో తన కెరీర్‌ను ముగించాడు.

టాప్ భారత ఆటగాళ్లు (ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు ఆస్ట్రేలియాపై వన్డేల్లో):

రోహిత్ శర్మ: 1000+ పరుగులు 

విరాట్ కోహ్లీ: 802 పరుగులు

సచిన్ టెండూల్కర్: 740 పరుగులు

ఎం.ఎస్. ధోని: 684 పరుగులు

Advertisment
తాజా కథనాలు