Yuzvendra Chahal - RJ Mahvash: ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!

టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్‌వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్‌వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. అందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ వార్తలకు మరింత బలం చూకూరినట్లైంది.

New Update
Yuzvendra Chahal - RJ Mahvash

Yuzvendra Chahal - RJ Mahvash Photograph


టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రేడియో జాకీ మహ్‌వశ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. అది వైరల్‌గా మారడంతో రచ్చ మొదలైంది. ఆమె పెట్టిన పోస్టు మామూలుది అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. తన మ్యారేజ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

‘హస్బెండ్’ పోస్టు

అందులోనూ ఆ వీడియోపై చాహల్ లైక్ చేయడంతో ఫ్యాన్స్ తమ కామెంట్లతో హోరెత్తించారు. ఇటీవల మహ్‌వశ్ ఒక ‘హస్బెండ్’ వీడియో పంచుకున్నారు. ‘‘ నా జీవితంలోకి ఏ అబ్బాయి వస్తాడో.. అతడే ఏకైక వ్యక్తి అవుతాడు. అతడే నాకు స్నేహితుడు.. అతడే నా ప్రియుడు.. అతడే నా భర్త.. నా జీవితం అతడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అవసరం లేని వ్యక్తులు నాకు వద్దు. 

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

ఆ సమయంలో ఇతర అబ్బాయిలతో నేను మాట్లాడలేను’’ అని ఒక వీడియో షేర్ చేసింది. అది విపరీతంగా వైరల్ అయింది. అయితే మహ్‌వశ్ ఆ వీడియోను చాహల్ కోసమే పెట్టిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దీంతో చాహల్, మహ్‌వశ్ రూమర్స్ రిలేషన్స్ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇవి ఎక్కడివరకు సాగుతాయో చూడాలి. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ఇదిలా ఉంటే గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చాహల్, మహ్‌వశ్ కలిసి స్టేడియంలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. చాహల్ తన మాజీ భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వడం, ఆ తర్వాత మహ్‌వశ్‌తో కలిసి స్టేడియంలో దర్శనమివ్వడంతో అంతా షాక్ అయిపోయారు. ప్రస్తుతం చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

(yuzvendra-chahal | RJ Mahvash | latest-telugu-news | telugu-news)

#telugu-news #latest-telugu-news #RJ Mahvash #yuzvendra-chahal
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు