/rtv/media/media_files/2025/07/24/rishab-pant-2025-07-24-14-34-05.jpg)
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి రోజు పంత్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడిన సంగతి తెలిసిందే, క్రిస్ వోక్స్ వేసిన బంతి అతని కుడి కాలి బొటనవేలికి బలంగా తగిలింది. స్కాన్ నివేదికలో అతని కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. పంత్ గాయం కారణంగా 37 పరుగుల వద్ద రిటైర్ అయ్యాడు, అతని స్థానంలో రవీంద్ర జడేజా మైదానంలోకి వచ్చాడు. అయితే గాయం పెద్దది కావడంతో ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో పంత్ దాదాపుగా సిరీస్ నుంచి తప్పుకున్నట్లే అని క్రీడావర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
Things Rishabh missed due to Injury :
— Rishi_mc. (@Rishi1793) July 24, 2025
• He was just 2 runs away from becoming India’s highest run‑scorer in WTC history,
• Needed two more sixes to surpass the Indian Test sixes record,
• Was ten runs short of recording a 500+ run series.#ENGvIND#RishabhPantpic.twitter.com/PUTP1XHxFN
ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు
పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది, ఐదో టెస్ట్‌కు ఇషాన్ కిషన్ స్టాండ్‌బైగా ఉండవచ్చు. ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన ఇషాన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురైనప్పటికీ.. తర్వాత దేశవాళీలో ఆడి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ఇషాన్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఆల్ రౌండర్ నితేష్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా సిరీస్ నుండి వైదొలగాడు. ఇక ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్ (గజ్జ), అర్షదీప్ సింగ్ (బొటనవేలు) కారణంగా నాల్గవ టెస్ట్‌కు అందుబాటులో లేరు. దీంతో భారత్ గాయాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Also read : Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ వచ్చాడు.. కుంటుకుంటూ క్రీజులోకి - VIDEO