Aga Khan : ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్‌ కన్నుమూత

బిలియనీర్‌, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్‌ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన స్వచ్ఛంద సంస్థ ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రకటించింది. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది.

New Update
agakhan

agakhan

బిలియనీర్‌, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్‌ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన స్వచ్ఛంద సంస్థ ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రకటించింది. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. అగా ఖాన్ IV అని కూడా పిలువబడే ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ .. అగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇళ్ళు, ఆసుపత్రులు, పాఠశాలలకు నిధులు సమకూర్చడానికి ఆయన తన సంపదను అంకితం చేశారు. 

స్విట్జర్లాండ్‌లో జన్మించిన ఆగాఖాన్ ..  20 ఏళ్ల వయసులో 1957లోనే ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా నియమితులయ్యారు. 1967లో ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ను స్థాపించారు.  ఈయన చేసిన సేవలకు గానూ  2015లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌  పురస్కారంతో సత్కరించింది. కాగా  ఆగాఖాన్‌ ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

అగా ఖాన్ 1969లో బేగం సమ్లిమా అగా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు., 1998లో బేగం ఇనారా అగా ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఆగాఖాన్‌ మృతిపట్ల కింగ్‌ చార్లెస్‌ 3కి తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు.  ఆయనకు కింగ్ చార్లెస్ 3, ఆయన తల్లి దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌ 2కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 

Also Read :  Delhi Assembly election 2025 : బిగ్ షాక్..  సీఎం అతిషి ఆఫీసర్ నుంచి రూ.5 లక్షలు స్వాధీనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు