/rtv/media/media_files/2025/05/04/YvNZOE7sSRL3fJqXbvsA.jpg)
RCB VS CSK
ఊహించని ఆటతో అబ్బురపరుస్తోంది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పెద్దగా స్కోరు చేయదు అనుకున్నారు అంతా. కానీ ఆరవ స్థానంలో వచ్చిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ ఆఖరి రెండు ఓవర్లలో పెను విధ్వంసమే సృష్టించాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసేశాడు. దీంతో ఆర్సీబీ స్కోరు ఏకంగా 213కు వెళ్ళిపోయింది. ఈ లక్ష్యం ఆ జట్టు విజయానికి సగం బాటలు వేసింది.
మొదట్లో తడబడ్డా తర్వాత సర్దుకుని నిలకడగా రాణిస్తోంది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్ లో జట్టుకు పిల్లర్ అయి నిలబడుతున్నాడు. నిన్న ఐపీఎల్ లో చెన్నై, బెంగళూరుల మధ్య మ్యాచ్ జరిగింది. చివర వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠతను రేపింది. దీంట్లో ఆర్సీబీ కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఆర్సీబీ ఇచ్చిన 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో ఆయుష్ మాత్రే (94; 48 బంతుల్లో 9×4, 5×6), రవీంద్ర జడేజా (77 నాటౌట్; 45 బంతుల్లో 8×4, 2×6) సూపర్ ఇన్నింగ్స్‌లతో సీఎస్కే విజయానికి చేరువగా వెళ్లింది. కానీ ఆఖరి ఓవర్లలో ఎంగిడి (3/30), యశ్ దయాళ్ (1/41) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్సీబీని గెలిపించారు. ఈ మ్యాచ్ తో బెంగళూరు జట్టు 8 మ్యాచ్ లు గెలవగా..చెన్నై తొమ్మిది మ్యాచ్ లు ఓడిపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్లు దుమ్ము దులిపేశారు. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేశారు. దీంతో సీఎస్కే ముందు 214 టార్గెట్ ఉంది. ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు చెలరేగిపోయారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విజృంభించారు.
ఆ తర్వాత వచ్చిన మరో బ్యాటర్ షెపర్డ్ స్టేడియంలో ఊచకోచ మొదలు పెట్టాడు. 14 బంతుల్లోనే 50 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది ఐపీఎల్‌లోనే రెండో వేగవంతమైన అర్ధశతకం కావడం విశేషం. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4, 6, 6, 4 కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో ఆర్సీబీ ఏకంగా 54 పరుగులు పిండుకుంది.
ఎవరెన్ని కొట్టారంటే?
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 62, జాకబ్ బెతెల్ 55, రొమారియో షెఫర్డ్ 53* రాణించారు. దేవ్‌దత్ పడిక్కల్ 17, రజత్ పటీదార్ 11, జితేశ్ శర్మ 7, టిమ్ డేవిడ్ 2 విఫలమయ్యారు. ఇక చెన్నై బౌలర్లలో మతీష పతిరన 3 వికెట్లు, సామ్ కరన్ 1 వికెట్, నూర్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నారు.
today-latest-news-in-telugu | rcb-vs-csk | match