RCB Vs DC: పీకల్లోతు కష్టాల్లో RCB.. 150 పరుగులన్నా చెయ్యండ్రా బాబు..

ఆర్సీబీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా మొదలెట్టి మధ్యలో పప్పులో కాలేసింది. వరుస వికెట్లు కోల్పొయింది. 15ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 117పరుగులు చేసింది. దీంతో 150 పరుగులైనా చెయ్యండ్రా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

New Update
RCB VS DC..

RCB VS DC

ఆర్సీబీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఘోరమైన బ్యాటింగ్ చేస్తుంది. తొలి ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా మొదలెట్టినా.. మధ్యలో పప్పులో కాలేసింది. వరుస వికెట్లు కోల్పొయింది. 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 117 పరుగులు మాత్రమే చేసింది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న డేవిడ్, కృనాల్ మెల్లి మెల్లిగా పరుగులు రాబడున్నారు. హమ్మయ్య అనుకునేలోపు కృనాల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆర్సీబీ 7 వికెట్లతో కష్టాల్లో పడింది. దీంతో 150 పరుగులు అయినా చెయ్యండ్రా బాబు అంటూ అభిమానులు మొత్తుకుంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు