/rtv/media/media_files/2025/04/10/QMAb1OGDHmUenRpEZkli.jpg)
RCB VS DC
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట ఇన్నింగ్ చేస్తున్న RCB దుమ్ము దులిపేస్తుంది. కేవలం 3ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. కానీ ఆదిలోనే ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. వరుసగా మూడు వికెట్లు ధన్ ధనా పడిపోయాయి. సాల్ట్, పడిక్కల్, కోహ్లీ పెవిలియన్‌కు చేరారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లీ, సాల్ట్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఆ దూకుడు ఎక్కువ సమయం నిలవలేకపోయింది.
కష్టాల్లో ఆర్సీబీ
సాల్ట్ ఫ్రంట్‌కెళ్లి ఆడటంతో స్టంప్‌కు దొరికిపోయాడు. దీంతో 17 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. కానీ అంతలోనే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. విరాట్ 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అనంతరం క్రీజ్‌లో ఉన్న పడిక్కల్ సైతం ఎక్కువ సమయం నిలవలేకపోయాడు. 8 బాల్స్ ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో 9 ఓవర్లలో ఆర్సీబీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ పటిదార్ (11*), లివింగ్‌స్టన్ (1*) ఉన్నారు.
🚨 Indian Premier League 2025, DC vs RCB 🚨
— Sporcaster (@Sporcaster) April 10, 2025
A brilliant shot from Virat Kohli#RCBvDC #DCvsRCB #RCBvsDC #DCvRCB #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Bengaluru #PlayBold #ನಮ್ಮRCB #DelhiCapitals #ViratKohli pic.twitter.com/z5ZM6IndE6