/rtv/media/media_files/2025/03/28/m5ZnfTxGoxwBKAgo30Uh.jpg)
CSK VS RCB
IPL 2025 CSK Vs RCB: చెన్నై బౌలర్లు బెంగళూరు బ్యాటర్లపై విజృంభిస్తున్నారు. చాలా వరకు పరుగులను కట్టడి చేశారు. దిగ్గజ బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేర్చారు. సింగిల్ రన్ చేయడానికి కూడా బెంగళూరు జట్టు అవస్తలు పడుతుంది. దీంతో నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ జట్టు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సీఎస్కే జట్టు ముందు 197 టార్గెట్ ఉంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. 30 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్స్‌లున్నాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు
మొదట టాస్ ఓడిన బెంగళూరు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చారు. ఫస్ట్ నుంచి ఇద్దరూ దూకుడు ప్రదర్శించారు. కేవలం 4 ఓవర్లలో 37/0 స్కోరు సాధించారు. ఇక దూకుడుగా ఆడుతున్న ఫిల్ సాల్ట్ (32)ను ధోనీ తన మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్ బాటపట్టించాడు. కళ్లు తెరిచి మూసేంతలో ధోని వికెట్లను పడగొట్టాడు. నూర్ అహ్మద్ వేసిన ఆ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా దూకుడుగా ఆడాడు. విరాట్, పడిక్కల్ కలిసి కొన్ని పరుగులు రాబట్టారు. కానీ అశ్విన్ వేసిన అద్భుతమైన బంతికి పడిక్కల్ పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రజత్ పటీదార్ మెల్లి మెల్లిగా ఆడుతూ పరగులు రాబట్టాడు. కానీ అంతలోనే విరాట్ ఔటవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!
కోహ్లీ (31)కే ఔటయ్యాడు. ఆ తర్వాత పటీదార్ ఒక్కడే స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఒకానొక సమయంలో ఆర్సీబీ జట్టు ఆ 196 పరుగులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ చివరి ఆఖరులో టిమ్ డేవిడ్ వరుస 3 హ్యాట్రిక్ సిక్సర్లతో విజృంభించాడు. అతడు 8 బంతుల్లో 22 పరుగులు రాబట్టాడు. దీంతో ఆర్సీబీ ఈ భారీ స్కోర్ చేయగలిగింది.