/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.ఆసియా కప్ నుండి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. ఆసియా కప్ లో భాగంగా ఇవ్వాళ UAEతో పాకిస్తాన్ కు మ్యాచ్ ఉంది. అయితే భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ హర్ట్ అయింది. రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని లేకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని బెదిరించింది. పాక్ తమ డిమాండ్‌కు కట్టుబడి పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి మరో లేఖ పంపింది. పీసీబీ, ఐసీసీకి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. పాకిస్తాన్ బోర్డు ఇప్పుడు తన జట్టును స్టేడియానికి వెళ్లకుండా అక్కడే ఉండమని కోరింది. దీంతో ఆటగాళ్లంతా హోటల్ రూమ్ లోనే ఉండిపోయారు.
#BreakingNews - Pakistan to pull out of Asia Cup: Sources#AsiaCup#Pakistanpic.twitter.com/mr3pswnkr0
— TIMES NOW (@TimesNow) September 17, 2025
Follow Us