Pakistan : పాపం ఎన్ని కష్టాలో..  పాకిస్థాన్ కు ఐసీసీ బిగ్ షాక్ !

తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 73 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వారికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.

New Update
pak-vs-nz fine

pak-vs-nz fine

తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 73 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వారికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ను ఉల్లంఘించినందుకు జట్టుకు ఈ జరిమనా విధించింది ఐసీసీ.  ఆర్టికల్ 2.22 అనేది ఆటగాళ్ళు, ఆటగాళ్ల సహాయ సిబ్బందికి సంబంధించినది.  దీని ప్రకారం ఆటగాళ్లు తమ జట్టు నిర్ణీత సమయంలోపు బౌలింగ్ చేయని ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.  

Also Read :  Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు!

73 పరుగుల తేడాతో ఓటమి

నేపియ‌ర్ వేదిక‌గా శనివారం రోజున జ‌రిగిన తొలి వ‌న్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.  దీంతో సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు విఫలమైంది. బాబర్ అజామ్ (75),  ఆఘా సల్మాన్ (51) పరుగులతో రాణించగా మిగితా ఆటగాళ్లు విఫలమయ్యారు. బాబర్ ఔటైన వెంటనే పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలింది. బాబర్ వికెట్ కోల్పోయినప్పుడు పాక్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 249 పరుగులు కాగా..  కేవలం 22 పరుగులకే పాక్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.

Also read :  Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్‌!

ఇక ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోయారు. ఏకంగా 43 ఎక్స్‌ట్రాలు (వైడ్స్, నోబాల్స్, బైలు, లెగ్‌బైలు) ఇచ్చారు. దీంతోవన్డేల్లో ఇచ్చిన మూడో అత్యధిక ఎక్స్‌ట్రాలు జట్టుగా పాక్ జట్టు నిలిచింది. 

Also Read :  Uttar Pradesh : భార్యకు పెళ్లి చేసిన భర్త..  సినిమా లెవల్ ట్విస్ట్ ఇచ్చిన బబ్లూ!

Advertisment
తాజా కథనాలు