అప్పుడు లవర్తో పెళ్లి.. ఇప్పుడు పిల్లల కోసం లొల్లి.. మూడో రోజే భార్యకు ట్విస్ట్ ఇచ్చిన భర్త!

భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనలో సినిమా లెవల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు వికాస్ తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ వద్దకు వచ్చేసింది.

author-image
By Krishna
New Update
marriage babloo

marriage babloo

భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనలో సినిమా లెవల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు వికాస్ తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ వద్దకు వచ్చేసింది. మూడు రోజులకే తన భార్యను తిరిగి తీసుకొచ్చేశాడు ఆ భర్త.  మార్చి 28వ తేదీన వికాస్ ఇంటికి వెళ్లిన బబ్లూ ఇద్దరు పిల్లలను చూసుకోవడం తన ఒక్కడికే కష్టమవుతోందని..పిల్లలిద్దరు ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నారంటూ వాపోయాడట.  తన భార్య రాధికను తనతో పంపించాలని వేడుకున్నాడట.  భార్యకు దూరమై పిల్లలిద్దరి బాధ్యత చూసుకుంటూ బబ్లూ అనుభవించే బాధ గురించి వికాస్ తల్లి గాయత్రి తన కొడుక్కి అర్థమయ్యేలా చెప్పిందట. దీంతో వికాస్ రాధికను తిరిగి బబ్లూ వద్దకు పంపాడు. వికాస్ తల్లి గాయత్రి మాట్లాడుతూ, తమ కుటుంబం మొదటి నుంచి ఈ వివాహాన్ని వ్యతిరేకించిందన్నారు.రాధికను పెళ్లి చేసుకోవడం వికాస్ కూడా ఇష్టం లేదని ..అయితే తన కొడుకు కోరిక కాదనలేకనే పెళ్లికి ఒప్పకున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ, రాధిక కలిసి ఉంటున్నారు.  

వికాస్‌తో పరిచయం, అక్రమ సంబంధం

కతర్ జోట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు - ఆర్యన్ (7), శివాని (2) జన్మించారు.  పనిపనుల కారణంగా బబ్లూ తరచుగా బయట ప్రదేశాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో రాధికకు స్థానిక యువకుడైన వికాస్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది అక్రమ సంబంధానికి దారి తీసింది.  ఆ సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత బబ్లూకు ఈ  విషయం తెలిసింది.  ఆ తర్వాత బబ్లూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. తాను ఎలాగూ తన భార్యకు సమయం కేటాయించలేకపోతున్నానని.. తన భార్య ఇష్టపడిన వ్యక్తితోనే ఇచ్చి రెండో పెళ్లి చేయాలని భావించాడు. అతను మొదట కోర్టుకు వెళ్లి తన భార్య, ఆమె ప్రేమికుడికి వివాహాన్ని ఘనంగా జరిపించాడు, ఆపై వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ వారు దండలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

Also Read :  Trump-America:ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు