pakistan: యూఏఈతో మ్యాచ్ ముందు పాక్ ఓవరాక్షన్..చివరకు మ్యాచ్ విన్..సూపర్-4 లోకి ఎంట్రీ..

నిన్న జరిగిన యూఏఈ మ్యాచ్ ముందు పాకిస్తాన్ చాలా ఎక్కువ చేసింది. మ్యాచ్ కు ముందు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సారీ చెప్పేంతవరకు ఆట మొదలెట్టలేదు. దీంతో ఒక గంట ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది.  కానీ ఎలాగో మ్యాచ్ మాత్రం గెలిచి సూపర్-4 కు చేరుకుంది.

New Update
pak team

భారత్ , పాక్ మ్యాచ్ పెద్ద గొడవకే దారి తీసింది.  ఆట తర్వాత భారత ప్లేయర్లు షేక హ్యాండ్ ఇవ్వలేదు. దీన్ని పాకిస్తాన్ పెద్ద ఇష్యూ చేసింది. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ మీద ఐసీసీకి ఫిర్యాదు చేసింది.  చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ టోర్నీ నుంచి వెళ్ళిపోతామని బెదిరించింది. అయితే ఐసీసీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పడంతో మళ్ళీ దారికి వచ్చింది. 

గంట ఆలస్యంగా..

అయితే ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇన్న యూఏఈతో జరిగిన మ్యాచ్ ముందు మళ్ళీ రచ్చ ర్చ చేసింది. రిఫరీ ఆండీ క్షమాపణ చెబితేనే గ్రౌండ్ లోకి దిగుతామంటూ భీష్మించుకుని కూర్చుంది. యూఏఈ టైమ్ ప్రకారం 6.30కి మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. 4.30కి ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంలో ఉండాలి.  కానీ గంటసేపటి వరకు పాకిస్తాన్ ఆటగాళ్ళు గ్రౌండ్ లోకి రాలేదు. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహాలు వెలువడ్డాయి. చివరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి జోక్యంతో సాయంత్రం 5.45కు ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియానికి బయల్దేరారు. రిఫరీ ఆండీ ప్రైకాఫ్ట్ సారీ చెప్పారని...దాని తర్వాతనే తమ ఆటగాళ్ళు స్టేడియానికి బయలు దేరారని పీసీబీ తెలిపింది. దీంతో యూఏఈ, పాకిస్తాన్ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం అయింది.  ఇందులో ట్విస్ట్ ఏంటంటే..క్షమాపణ విషయంలో పైక్రాఫ్ట్  కానీ, ఐసీసీ  కానీ ఏ అధికారిక ప్రకటనా చేయలేదు.  ఆండీ సమాచార లోపానికి మాత్రమే క్షమాపణ చెప్పారని ఐసీసీ చెప్పింది. 

సూపర్ -4 కు...

గంట ఆలస్యంగా మ్యాచ్ మొదలెట్టిన విజయంలో మాత్రం ఎక్కడా తడబడలేదు పాకిస్తాన్. చివరి లీగ్ మ్యాచ్ లో పాక్ జట్టు యూఏఈపై 41 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్ 4లోకి చేరుకుంది.   గ్రూప్ ఎ నుంచి ఇప్పటికే భారత్ సూపర్ 4 కు చేరుకుంది.  టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 9 వికెట్లకు 146 పరుగులే చేయగలిగింది.  ఫకార్ జమాన్ 5౦ పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.  సల్మాన్  ఆఘా 20 పరుగులు చేయగా మిగతా వారందరూ కేవలం సింగిల్ డిజిట్లకే వెనుదిరిగారు. చివర్లో షహిన్ అఫ్రిది 29 పరుగులు చేయడం ఆ జట్టుకు కలిసొచ్చింది.  దీని తర్వాత 146 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. అబ్రార్ అహ్మద్ (2/13), షహీన్ అఫ్రిది (2/16), హారిస్ రవూఫ్ (2/19) ఆ జట్టును దెబ్బ తీశారు. షహీన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read: BIG BREAKING: బాంగ్లాదేశ్ లో మరో తిరుగుబాటు.. డేంజర్ లో యూనస్ సర్కార్!

Advertisment
తాజా కథనాలు