Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, సురేష్ రైనా రియాక్షన్స్

ఆపరేషన్ సిందూర్‌పై టీమిండియా క్రికెటర్స్ రియాక్ట్ అయ్యారు. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌‌తో పాటు మరెంతో మంది క్రికెటర్లు స్పందించారు. వారంతా ‘‘ జై హింద్’’ అంటూ మద్దతు పలికారు. ఈ మేరకు ట్వీట్‌లు చేశారు.

New Update
Operation Sindoor team india reacation

Operation Sindoor team india reacation

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగా ఇండియన్ ఆర్మీ పగ తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌తో సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. మే6వ తేదీ (మంగళవారం) అర్థరాత్రి తర్వాత.. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ గాఢనిద్రలో ఉన్న టైంలో సరిగ్గా 1.44 గంటలకు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి మట్టు బెట్టింది. 

ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు. 

క్రికెటర్ల రియాక్షన్స్

దీంతో భారత ప్రభుత్వ చర్యపై దేశ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు గర్విస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్స్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌‌తో పాటు మరెంతో మంది క్రికెటర్లు స్పందించారు. వారంతా ‘‘ జై హింద్’’ అంటూ మద్దతు పలికారు. 

team-india | Operation Sindoor Attack | gautam-gambhir | veerendra-sehwag | suresh-raina

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు