పాత నీరు పోతుంది..దాని స్థానంలో కొత్త నీరు వస్తుంది. ఇదొక నిరంతర ప్రవాహం అంటున్నారు మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ. స్టార్ క్రికెటర్లు లేని లోటను యువ ఆటగాళ్ళు ఎప్పుడూ భర్తీ చేస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎంతొ మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. ఎంత రిటైర్ అయినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. టీమ్ ఇండియా కుర్రాళ్ళు ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లో అద్భుత ప్రదర్శన నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్, భారత్ ఎ, అండర్-19 టీమ్స్ రూపంలో భారత్‌కు చాలా వేదికలు ఉన్నాయని.. మంచి క్రికెటర్లు జట్టులోకి ఎపుడూ వస్తుంటారు అని దాదా అన్నారు. విరాట్, రోహిత్, అశ్విన్ లాంటి వాళ్ళు వెళ్ళిపోగానే అందరూ ఇండియన్ క్రికెట్ పని అయిపోయినట్టు మాట్లాడారు. ఇంగ్లాండ్ లో చివరి మ్యాచ్ గెలిచి సీరీస్ ను సమం చేసే వరకూ కూడా ప్రస్తుతం ఉన్న టీమ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ వాటన్నింటికీ శుభ్ మన్ గిల్ టీమ్ చాటా గట్టిగానే సమాధానం ఇచ్చింది. దీనిపై గంగూలీ కూడా పై విధంగా స్పందించారు.
స్టార్ క్రికెటర్ల స్థానంలో యువ ఆటగాళ్ళు..
ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా అద్భుతంగా ఆడింది. భారత క్రికెట్ ఎప్పటిలానే ఉంది. దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అది ఎవరి కోసమూ ఆగదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సౌరవ్ గంగూలీ. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి వాళ్ళ తర్వాత ఆ స్థానాలను సచిన్, కుంబ్లే, శ్రీనాథ్ లాంటి వాళ్ళు భర్తీ చేశారు. ద్రావిడ్, నేను, వీవీఎస్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రతిభ చూపించాము. మా తరువాత విరాట్, రోహిత్, జడేజాలాంటి వాళ్ళు ఎంతో బాగా ఆడారు. ఇప్పుడు వారి స్థానాలను యశస్వి జైస్వాల్, గిల్, పంత్ లు తీసుకున్నారు. తర్వాత కూడా ఇంకా చాలా మంది యువ ఆటగాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పటికీ వర్రీ అవాల్సిన అవసరమే లేదని గంగూలీ చెప్పుకొచ్చారు.
ఇక ఇంగ్లాండ్ టెస్ సీరీస్ లో ఆడిన ఆటగాళ్ళపై ప్రశంసలు వర్షం కురిపించారు సౌరవ్. మాంచెస్టర్ లో నాల్గవ టెస్ట్ లో నిరాశ పరిచినా...ఐదవ దానిలో బాగా పుంజుకుని ఆడారని అభినందించారు. అనుభవం లేని ఆటగాళ్ళు కూడా లద్భుతంగా ఆడారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ జట్టును బాగా నడిపించాడు అని గంగూలీ పొగిడారు. భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ ఆకట్టుకున్నారని సౌరవ్ పొగడ్తల్లో ముంచెత్తారు.
Also Read: Trump Warning: ముందుంది ముసళ్ళ పండగ..మరిన్ని సుంకాల వాయింపు అంటున్న ట్రంప్
Sourav Ganguly: భారత క్రికెట్ ను ఎవరూ ఆపలేరు..సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా టెస్ట్ సీరీస్ సమం చేసిన సందర్భంగా సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని, ఎవరూ ఆపలేరని కామెంట్ చేశారు.