Kamareddy Incident
ఇద్దరం కలిసే చనిపోదాం..!
విచారణ నేపథ్యంలో పోలీసులు భిక్కనూర్ పీఎస్ నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు దారి పోడవునా సీసీ ఫుటేజీ సేకరిస్తున్నారు. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను పరిశీలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1:26 నిమిషాలకు ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లుగా తెలిపారు. చాటింగ్ లో నిఖిల్, శృతి మధ్య ఆత్మహత్య గురించి చర్చ జరిగినట్లు బయటపడింది. నేను ఆత్మహత్య చేసుకుంటానంటే..నేనూ చేసుకుంటానని... లేదా ఇద్దరం కలిసే చేసుకుందాం అంటూ చాటింగ్ చాటింగ్ చేసుకున్నారు. ఎస్సై కి సంబంధించిన మూడు సెల్ ఫోన్లలో ఒకటి మాత్రమే అన్ లాక్ అయ్యింది. మరోవైపు ఆర్థికపరమైన అంశాల కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ముగ్గురి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు.
Also Read: ఓటీటీలో ఒబామా మెచ్చిన ఇండియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఈ నెల 26న అర్థరాత్రి సమయంలో సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి చెరువులోనిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలో లభ్యమయ్యాయి. ఆ తర్వాత రోజు మళ్ళీ గాలించగా అదే చెరువులో శవం దొరికింది. ఒకే స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ శృతి కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్నారు. శృతికి ఇప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి. ఆపరేటర్ నిఖిల్ వీరికి మధ్యవర్తిగా వ్యవహరించాడు.
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?