Martin Guptill Retires
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్టిల్ న్యూజిలాండ్ తరఫున 198 వన్డేలు ఆడారు. అలాగే 122 T20లు, 47 టెస్టులు ఆడారు. మొత్తంగా ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 13,463 పరుగులు చేశారు. అందులో 23 సెంచరీలు ఉన్నాయి. చివరి సారిగా 2022 సెప్టెంబర్‌లో తన లాస్ట్ వన్డే ఆడారు.
Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!
ఇకపోతే గఫ్టిల్ టీ20ల్లో ఎక్కువగా సక్సెస్ అయ్యారు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన బెస్ట్ ఆటగాడిగా నిలిచారు. 122 మ్యాచ్‌లలో 3,531 రన్స్‌తో ఫస్ట్ స్థానంలో ఉన్నారు. ఇక ODI (వన్డే) పరుగుల స్కోరర్ల జాబితాలో రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత మూడవ స్థానంలో (7,346) పరుగులతో నిలిచాడు. మార్టిన్ గప్టిల్ జనవరి 2009లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన ODI సిరీస్‌లో న్యూజిలాండ్‌లోకి అరంగేట్రం చేశారు.
Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త
మొదటి కివీస్ బ్యాటర్‌గా
తొలి మ్యాచ్‌లోనే 135 బాల్స్‌కి 122 రన్స్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఫస్ట్ వన్డే మ్యాచ్‌లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొదటి కివీస్ బ్యాటర్‌గా నిలిచారు. టెస్టుల్లో 2586 పరుగులు చేశాడు. గప్టిల్ 76 హాఫ్ సెంచరీలతో పాటు ఫార్మాట్లలో మొత్తం 23 సెంచరీలు కొట్టాడు.
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!
తాజాగా తన రిటైర్మెంట్‌పై గఫ్టిల్ మాట్లాడారు ‘‘ న్యూజిలాండ్‌కు ఆడాలనేది నా కల, నా దేశం కోసం 367 గేమ్‌లు ఆడినందుకు నేను చాలా అదృష్టవంతుడిని, నేను చాలా గర్వంగా భావిస్తున్నాను’’ అని మార్టిన్ గప్టిల్ అన్నారు. అలాగే ‘‘సంవత్సరాలుగా నా సహచరులు, కోచింగ్ సిబ్బందికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.
ముఖ్యంగా అండర్ 19 స్థాయి నుండి నాకు శిక్షణనిచ్చిన మార్క్ ఓ'డొనెల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా గుప్తిల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కానీ అతను దేశీయ క్రికెట్, T20 ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడు. ప్రస్తుతం అతను ఆక్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.