MI VS DC: ముంబయ్ సూపర్ విక్టరీ..ఫ్లే ఆఫ్స్ కు నాలుగో టీమ్

ముంబయ్ ఇండియన్స్ మొత్తానికి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఢిల్లీపై ఈరోజు జరిగిన మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. మరోవైపు ఢిల్లీ సేన ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

MI VS DC

ఈరోజు ముంబయ్ వాంఖడే స్టేడియంలో ముంబయ్ ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స కు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఎమ్ఐ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఆదిలోనే ఢిల్లీ టీమ్ కు పెద్ద దెబ్బ తగిలింది. టాప్ బ్యాటర్ 11 పరుగులకే పెవిలియన్ బాట పట్టడం ఆ జట్టును ఘోరంగా దెబ్బతీసింది. డీసీ టీమ్ లో సమీర్ రిజ్వీ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తరువాత విప్రాజ్ నిగమ్ 20, అశుతోష్ శర్మ 18 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3, బుమ్రా 3, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. ముంబయ్ బౌలర్ల ధాటకి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏ దశలోనూ లక్ష్యం వైపుగా అడుగులు వేయలేకపోయారు. ఈ మ్యాచ్ విజయంతో ముంబయ్ ఇండియన్స్ టాప్ 4 లోకి వెళ్ళడమే కాకుండా ప్లే ఆఫ్స్ లోకి కి చేరిన నాలుగో జట్టుగా నిలిచింది. ఇంతకు ముందే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. 

చెలరేగిన సూర్య కుమార్..

అంతకు ముందు బ్యాటాంగ్ చేసిన ముంబయ్ ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే దూకుడుగా ఆడాడు. సూర్య 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73* రన్స్ చేశాడు.  నమన్ ధీర్ (24*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్‌టన్ (25), విల్ జాక్స్ (21), తిలక్ వర్మ (27) పరుగులు చేశారు. రోహిత్ శర్మ (5), హార్దిక్ పాండ్య (3) మరోసారి నిరాశపర్చారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 2, చమీర, ముస్తాఫిజుర్, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.   చివరి రెండు ఓవర్లలో ఎమ్ఐ బ్యాటర్లు 48 పరుగులు రాబట్టారు. ఇవే ఈరోజు ఆ జట్టును కాపాడాయి.  ముకేశ్‌ వేసిన 19 ఓవర్‌లో సూర్య సిక్స్ కొట్టి అర్ధ శతకం (35 బంతుల్లో) అందుకోగా.. తర్వాత నమన్ ధీర్ వరుసగా 4, 6, 6, 4 బాదేశాడు. చమీర వేసిన ఆఖరి ఓవర్‌లో సూర్యకుమార్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు రాబట్టాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | mi-vs-dc | match

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు