MI vs KKR: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన.. సిక్స్‌లతో చెలరేగిపోయిన రోహిత్

వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే ముంబై జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చి సిక్స్‌లతో చెలరేగిపోయాడు.

New Update
Rohith Sharma record

Rohith Sharma

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి ఇన్నింగ్స్‌ను పూర్తి చేసుకుంది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు కేకేఆర్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు ఆలౌట్ చేసింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో బోణీ కొట్టాలంటే 117 పరుగులు చేయాలి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. క్రీజులోకి ర్యాన్ రికెల్‌టన్, రోహిత్ శర్మ వచ్చారు. అయితే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. ఇలానే ముంబై ఇండియన్స్ ఆడితే.. బోణీ కొట్టేస్తుంది. 2.5 ఓవర్లలో ముంబై జట్టు 28 పరుగులు చేసింది.

Advertisment
తాజా కథనాలు