Champions Trophy: హిట్ మ్యాన్ ప్రపంచ రికార్డ్..అత్యధిక సిక్స్ లు..

ఛాంపియన్స్ ట్రోపీలో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సాధించాడు. హిట్ మ్యాన్ సిక్స్ కొట్టి ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

New Update
Rohith Sharma Century

Rohith Sharma Century

ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 264 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తోంది. అయితే పెనర్ గా వచ్చిన కెప్టెన్ దూకుడుగా ఆడడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో మాత్రం నిలువలేకపోయాడు. స్పిన్నర్ కూపర్ కనోలీ బౌలింగ్ లో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే నాథన్ ఎల్లిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో రెండో బంతిని రోహిత్‌ ఫుల్ షాట్‌తో స్టాండ్స్‌లోకి పంపించాడు. ఈ సిక్సర్‌తో హిట్ మ్యాన్ ప్రపంచ రికార్డును తన పేరి రాసుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సిక్స్ లు బాదిన క్రికెటర్ గా రోహిత్ చరిత్ర లిఖించాడు. అంతకు ముందు ఉన్న క్రిస్ గేల్ ను అధిగమించి ముందుకు వెళ్ళిపోయాడు. 

ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్లు 

రోహిత్ శర్మ - 65 సిక్స్‌లు (42 ఇన్నింగ్స్‌లు)
క్రిస్ గేల్ -  64 సిక్స్‌లు (51 ఇన్నింగ్స్‌లు)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ -  49 సిక్స్‌లు (30 ఇన్నింగ్స్‌లు)
డేవిడ్ మిల్లర్ - 45 సిక్స్‌లు (30 ఇన్నింగ్స్‌లు)
సౌరభ్ గంగూలీ -  42 సిక్స్‌లు.. (32 ఇన్నింగ్స్‌లు)
డేవిడ్ వార్నర్ -  42 సిక్స్‌లు (33 ఇన్నింగ్స్‌లు)
ఇయాన్ మోర్గాన్ - 40 సిక్స్‌లు (40 ఇన్నింగ్స్‌లు)
ఏబీ డివిలియర్స్ - 39 సిక్స్‌లు.. (35 ఇన్నింగ్స్‌లు)
బ్రెండన్ మెక్‌కల్లమ్ - 36 సిక్స్‌లు.. (39 ఇన్నింగ్స్‌లు)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు