Mohammed Shami: చిక్కుల్లో మహమ్మద్ షమీ.. విమర్శలకు దారి తీసిన డ్రింక్ బాటిల్!

మహమ్మద్ షమీ వివాదంలో పడ్డాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అతడు డ్రింక్ తాగడంపై విమర్శలకు గురయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం పాటించనందుకు షమీని నేరస్థుడిగా ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు పరిగణించారు. అతడు దేవునికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నాడు.

New Update
mohammed shami energy drink controversy in Champions Trophy 2025

mohammed shami energy drink controversy in Champions Trophy 2025

shami energy drink controversy: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మహమ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో బ్యాటర్లను కట్టడి చేశాడు. స్టార్ బ్యాటర్లను ఔట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అదే సమయంలో అతడు చేసిన ఓ పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అతడు ఆ పని చేసి ఉండకూడదు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ షమీ ఏం చేశాడు.. అతడిపై అంతలా విమర్శలు చేయడానికి గల కారణం ఏంటనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

సాధారణంగా క్రీడాకారులు మైదానంలో ఆడుతున్నపుడు గ్లూకోజ్ వాటర్ లేదా మరేదైనా డ్రింక్స్ తాగుతారు. బాడీ అలసిపోకుండా ఉండేందుకు ఎనర్జీ కోసం ఇలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ఆట ఆడుతున్నపుడు దాహం వేసినా ఎనర్జీ డ్రింక్ తాగకపోతే అది డీహైడ్రేషన్‌కు గురై కళ్లు తిరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే క్రీడాకారులు మైదానంలో కాస్త బ్రేక్ తీసుకుని మరీ డ్రింక్స్ తాగుతారు. అయితే అలా చేసినందుకే ఇప్పుడు షమీ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

ఎనర్జీ డ్రింక్ వివాదం

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఎనర్జీ డ్రింక్ తాగాడు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది. అదేంటి అలా తాగితే తప్పేముంది.. గేమ్‌లో దాహం వేస్తే ఎవరైనా తాగుతారు అని అనుకుంటున్నారా?. అది నిజమే కానీ ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తోంది. ముస్లింలు అతి పవిత్రంగా భావించే పండుగ ఇది. ఈ సమయంలో ముస్లింలు అందరూ ఉపవాసాలు పాటిస్తారు. కనీసం మంచి నీళ్లు కూడా తాగరు. 

ముస్లిం జమాత్ అధ్యక్షుడు ఫైర్

దీంతో మహమ్మద్ షమీ మ్యాచ్ సమయంలో డ్రింక్ తాగడంతో ముస్లిం పెద్దలు అతడిపై విరుచుకుపడుతున్నారు. షమీ చేసిన పనికి అంతా కలిసి అతడిని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ.. షమీని తీవ్రంగా విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) పాటించనందుకు మహమ్మద్ షమీపై మండిపడ్డారు. 

ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “ఇస్లాంలో తప్పనిసరి విధుల్లో ఒకటి రోజా (ఉపవాసం). ఆరోగ్యంగా ఉన్న పురుషుడు లేదా స్త్రీ రోజాను పాటించకపోతే, వారిని పెద్ద నేరస్థుడిగా పరిగణిస్తారు. మ్యాచ్ సమయంలో మహమ్మద్ షమీ నీరు తాగాడు. ఇది ప్రజలలో తప్పుడు సందేశాన్ని పంపుతుంది. షరియత్ దృష్టిలో, అతను నేరస్థుడు. దేవునికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.” అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే ఓ వీడియో రిలీజ్ చేశాడు. షమీ తీరుపై ముస్లిం నెటిజన్లు సైతం నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. షమీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు