Shami: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు మైదానంలోకి అడుగు పెట్టాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమైన షమీ.. రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. తొలి రోజు 10 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చిన షమీ.. ఒక్క వికెట్ తీయలేదు. కానీ రెండో రోజు మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 9 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మంచి రనప్‌తో ఉత్సాహంగా కనిపించిన షమీ.. ఆస్ట్రేలియా టూర్ కు సిద్ధంగా ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు సందేశాలు పంపిస్తున్నాడు.
రెండో టెస్టుకు అందుబాటులో షమీ..
ఇక షమీ మెరుగైన ప్రదర్శనపై మాజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో టెస్టుకు షమీ జట్టుతో చేరేందుకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా పేస్ పిచ్‌లపై షమీ విజృంభించగలడని, షమీ రాకతో భారత బౌలింగ్ మరింత బలపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి టెస్టు నాటికి ఫిట్‌నెస్ నిరూపించుకొంటే షమీని తీసుకుంటామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌లోనూ షమీ లైన్ క్లియర్ చేసుకోబోతున్నాడనే సంకేతాలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Aghori: నడిరోడ్డుపై వాడి పురుషాంగం కొయ్యబోతున్నా.. అఘోరీ సంచలనం!
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 228 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ 103/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన మధ్యప్రదేశ్‌కు బెంగాల్ బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ఎంపీ కెప్టెన్ శుభమ్ శర్మను బౌల్డ్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టిన షమీ.. చివరి మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
ఇది కూడా చదవండి: KTR: వాడి నియోజకవర్గంలో మాకేం పని.. రేవంత్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్!