Ind Vs Ban: మహ్మద్ షమీ ఖాతాలో ప్రపంచ రికార్డు.. మిచెల్ స్టార్క్‌ను వెనక్కి నెట్టి!

మహ్మద్ షమీ రికార్డు క్రియేట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో షమీ అదరగొట్టేశాడు. అత్యంత వేగంగా 200 వికెట్లను తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ 5126 బంతుల్లో ఈ మార్క్‌కు చేరుకోగా.. మిచెల్ స్టార్క్‌ 5240 బంతుల్లో పడగొట్టాడు.

New Update
Mohammed Shami breaks Mitchell Starc's world record

Mohammed Shami breaks Mitchell Starc's world record

Ind Vs Ban: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇవాళ దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. భారత బౌలర్ల ధాటికి ఆదిలోనే కుప్పకూలిపోయింది. కేవలం 50 నుంచి 60 పరుగులకే బంగ్లా 5 వికేట్లు కోల్పోయింది. మొత్తంగా బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది.  

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

అయితే మ్యాచ్‌లో భారత్ స్టార్ పేసర్ మహ్మద్ షమ్మీ(Mohammed Shammi) చెలరేగిపోయాడు. క్రీజ్‌లో ఎలాంటి బ్యాటర్ ఉన్నా లెక్కచేయలేదు. తన స్పీడ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఈ మ్యాచ్‌లో దాదాపు 5 వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌తో ప్రపంచ రికార్డును అందుకున్నాడు. తన కెరీర్‌లో 200 వికెట్లను అత్యంత వేగంగా తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా పేసర్() స్టార్క్ రికార్డును బ్రేక్ చేశాడు. 

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

షమీ 5126 బంతుల్లో ఈ మార్క్‌కు చేరుకోగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. దీంతో ఇంత కాలం తీవ్ర గాయాలతో ఆడలేకపోయిన షమీకి, టీమిండియాకు ఇదొక అద్భుతమైన శుభారంభం అనే చెప్పాలి. 

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

Fewest balls to 200 ODI wickets

5126 మహ్మద్ షమీ

5240 మిచెల్ స్టార్క్

5451 సక్లెయిన్ ముష్తాక్

5640 బ్రెట్ లీ

5783 ట్రెంట్ బౌల్ట్

5883 వకార్ యూనిస్

Fewest ODIs to 200 wickets

102 మిచెల్ స్టార్క్

104 మహ్మద్ షమీ/ సక్లెయిన్ ముష్తాక్

107 ట్రెంట్ బౌల్ట్

112 బ్రెట్ లీ

117 అలన్ డోనాల్డ్

Fastest Indians to 200 ODI wickets

మహ్మద్ షమీ (104 వన్డేలు)

అజిత్ అగార్కర్ (133 వన్డేలు)

జహీర్ ఖాన్ (144 వన్డేలు)

జవగల్ శ్రీనాథ్ (147 వన్డేలు)

కపిల్ దేవ్ (166 వన్డేలు)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు