DC vs LSG : రాణించిన మార్‌క్రమ్, మార్ష్‌.. ఢిల్లీ టార్గెట్ 160

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. పూరన్ (9), అబ్దుల్ (2) విఫలమయ్యారు. మిల్లర్ (14) పరుగులు చేశాడు.

New Update
dc-vs-Lucknow

dc-vs-Lucknow

లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐదెన్ మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (14) పరుగులు చేశాడు.ఆయుష్ బదోని (36) దూకుడుగా ఆడాడు. 9.5 ఓవర్లకు 87/0తో పటిష్టస్థితిలో లక్నో .. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఊహించిన దానికన్నా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 4, మిచెల్ స్టార్క్, దుష్మాంత చమీర ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also read :  5సార్లు ఓడినా.. వదల్లే ఆరోసారి AIR 68వ ర్యాంక్ కొట్టిన మన తెలుగోడు

Also read : Jagga Reddy : గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ పేషంట్కు రూ.10 లక్షలు!

జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ :ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

ఢిల్లీ క్యాపిటల్స్ :అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(w), అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్

Advertisment
తాజా కథనాలు