/rtv/media/media_files/2025/10/25/kohli-breaks-sachins-record-2025-10-25-20-28-19.jpg)
Kohli breaks Sachin's record
రెండు డకౌట్ల తర్వాత విరాట్ కోహ్లీ చివరకు ఆస్ట్రేలియా గడ్డపై పరుగులు వరద పెట్టించాడు. సిడ్నీ పిచ్‌పై తన పాత అవతారంలో తిరిగి కనిపించాడు. కేవలం 56 బంతుల్లో విరాట్ తన అర్ధ సెంచరీని సాధించాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 55 పరుగులు చేయడంతో అరుదైన ఘనత సాధించాడు. దీంతో అతడు వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నాడు.
ఈ మ్యాచ్ లో 55 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ.. శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ కుమార్ సంగక్కరను వెనక్కి నెట్టాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ రెండవ స్థానంలోకి చేరుకున్నాడు. కుమార్ సంగక్కర మూడో ప్లేస్ కు దిగిపోయాడు.
సంగక్కరను అధిగమించిన కోహ్లీ
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆసీస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 55వ పరుగు చేసిన తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో సంగక్కర మొత్తం 404 మ్యాచ్‌ల్లో 14,234 పరుగులు సాధించాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి 54 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ లో కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేయడం ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో కోహ్లీ తన 305వ వన్డే మ్యాచ్ లో 14,255* పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించుకున్నాడు. సచిన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు 463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు సాధించాడు.
Kohli surpasses Sangakkara to become the second-highest run-scorer in ODI history ⬆️🇮🇳
— Sky Sports Cricket (@SkyCricket) October 25, 2025
Only Sachin Tendulkar sits above him now 👑 pic.twitter.com/W4rpghFWTW
ఇదిలా ఉంటే వన్డే సిరీస్‌లో కోహ్లీ తొలిసారిగా మంచి ఫామ్‌లో కనిపించాడు. ప్రారంభం నుండే.. అతని బ్యాటింగ్ అతను ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని నిరూపించింది. ఈ సిరీస్‌లో తన మొదటి పరుగు తర్వాత కోహ్లీ సరదాగా సంబరాలు చేసుకోవడం విశేషం.
సచిన్ రికార్డు బ్రేక్
మరోవైపు కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకోల్పాడు. ఈసారి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఫీట్‌లో కోహ్లీ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో కోహ్లీ 50+ స్కోర్ చేయడం ఇది 70వ సారి కాగా.. సచిన్ 69 సార్లు ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడవ స్థానం(55)లో ఉన్నాడు.
 Follow Us
 Follow Us