AP High Court: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టు షాక్!

వైసీపీ సోషల్‌ మీడియా టీమ్ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయింది. బాధిత కుటుంబాల హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కీలక ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఈ నెల 4 నుంచి ఈరోజు వరకూ ఉన్న CC ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్‌లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

New Update
AP High Court: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఆ నలుగురు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..!

YSRCP: వైసీపీ సోషల్‌ మీడియా టీమ్ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత పోలీస్‌స్టేషన్ల నుంచి సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 4 నుంచి ఈరోజు వరకూ ఉన్న సీసీ ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్‌లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. పౌరస్వేచ్ఛను కాపాడ్డంలో ఈకోర్టు బాధ్యత ఉందని వ్యాఖ్యానించింది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా? అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రొసీజర్‌ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తాం అని పేర్కొంది.

Also Read: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్!

కొనసాగుతున్న కేసులు...

ఏపీలో సోషల్ మీడియా కేసులు వరుసగా నమోదు అవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే పేరుతో వరుసగా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ లో ప్రభుత్వం కి వ్యతిరేకంగా ఒకరు పోస్ట్ పెట్టారని గ్రూప్ సభ్యులు అందరికి నోటీసులు  విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ లోని వివిధ ప్రాంతాల నుండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు వాట్సాప్ గ్రూప్ సభ్యులు.

Also Read: Srisailamశ్రీశైలం దేవస్థానంలో లంచావతారం ఎత్తిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌

411 సభ్యులతో వైస్సార్ వైఎస్ఆర్ కుటుంబం వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నాడు దిలీప్ రెడ్డి. వైయస్సార్ కుటుంబం గ్రూప్ లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ వచ్చింది అనే పేరుతో గ్రూపులో ఉన్న 411 మందికి BNS 179 పేరుతో నోటీసులు అందాయి. గ్రూప్ లో ఉన్న జర్నలిస్టులకు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు నోటీసులు ఇచ్చారో కనీస వివరణ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఇవ్వలేదు. ఎనిమిదో తారీకు ఉదయం విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ  పోలీసులు తెలిపారు. ఖమ్మం, కరీంనగర్, భువనగిరి,  మణుగూరు,  యాదాద్రి కొత్తగూడెం,  మెదక్, రంగారెడ్డి ప్రాంతాల నుండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వాట్సప్ గ్రూప్ సభ్యులు చేరుకుంటున్నారు. జయహో జగన్నన్న, వైయస్సార్ సోషల్ మీడియా ఖమ్మం, ఆంధ్రా సింహం గ్రూపుల్లో ఉన్న సభ్యులు అందరికి  విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Also Read: ఈ దేశాన్ని పిల్లులు పాలిస్తాయి.. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం

Also Read: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

Advertisment
Advertisment
తాజా కథనాలు