/rtv/media/media_files/2025/06/21/indian-cricket-2025-06-21-11-42-03.jpg)
Indian Cricket: జూన్ 20వ తేదీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ కు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే 1996 జూన్ 20న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో లెజండరీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ టెస్ట్ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్ లోనే గంగూలీ 131, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచానికి తమను తాము గట్టిగా పరిచయం చేసుకున్నారు.
Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?
ఇక 2011 జూన్ 20న కింగ్స్ స్టన్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్ 4, రెండో ఇన్నింగ్స్ 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ సిరీస్ లో కోహ్లి హయ్యెస్ట్ స్కోర్ 30. కానీ ఆ తర్వాత కోహ్లి క్రికెట్లో కింగ్ అయ్యాడు. టెస్టు క్రికెటుకు వన్నె తెచ్చిన భారత క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. ఒకానొక దశలో సచిన్ రికార్డులు బద్దలు కొడతాడని అందరూ భావించారు. కానీ అకస్మాతుగా రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
తొలి మ్యాచ్ డకౌట్
తాజాగా ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్(Sai Sudarshan) ఇవ్వాళ (జూన్ 20) టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే డకౌట్ కావడం క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. అంతర్జాతీయ వేదికపై ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లు, వాతావరణం అంత త్వరగా అర్థం కావు. కాబట్టి సాయి సుదర్శనన్ ను అంత త్వరగా జడ్జ్ చేయడం మంచిది కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాయికి మంచి రికార్డే ఉంది. దాదాపు 40 సగటుతో ఆడాడు. ఒక డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కాబట్టి కేవలం ఐపీఎల్ అయితేనే ఆడతాడని విమర్శలు చేయడం సరైనది కాదు. ఇక 2025 జూన్ 20వ తేదీనే కెప్టెన్ గా గిల్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడి సెంచరీతో మెరిశాడు. ఇన్ని ప్రత్యేకతలున్న జూన్ 20 టీమిండియా క్రికెట్ కు ఎంతో స్పెషల్ మరీ.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
Nothing against Sai Sudharshan but imagine the outrage if Ruturaj Gaikwad would have got out in such a way. pic.twitter.com/O4RG6uJV21
— JEthalaL Gada™ 💛 (@JethiyaTweets) June 20, 2025
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!