సిరాజ్‌ మాములోడు కాదు.. స్టార్ సింగర్ మనవరాలితో డేటింగ్ .. అమ్మాయి ఎవరంటే!

క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనాయ్ భోంస్లే కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జనాయ్ భోంస్లే తన 23వ పుట్టినరోజు వేడుకలో మహ్మద్ సిరాజ్‌తో ఆమె క్లోజ్ పిక్ వైరల్ గా మారడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
siraj, Zanai Bhosle

siraj, Zanai Bhosle Photograph: (siraj, Zanai Bhosle)

టీమిండియా  క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనాయ్ భోంస్లే కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  జనాయ్ భోంస్లే తన 23వ పుట్టినరోజును ముంబైలో జరుపుకున్నారు. ఈ ఈవెంట్ కు మహ్మద్ సిరాజ్‌ హాజరయ్యాడు.

అతనితో దిగిన ఫోటోలను  జనాయ్ భోంస్లే ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ  హైదరాబాదీతో క్యాండిడ్ అని ఉంది.  చాలామందితో జనాయ్ భోంస్లే ఫోటోలు దిగినప్పటికీ సిరాజ్ తో ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. 

దీంతో సిరాజ్‌తో ఆశా భోంస్లే మనవరాలు డేటింగ్ లో ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సిరాజ్‌, జనాయ్ భోంస్లే నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.  ఆమె పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వారిలో నటుడు జాకీ ష్రాఫ్, ఆమె అమ్మమ్మ ఆశా భోంస్లే, క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేసాయి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్ , ముంజ్యా స్టార్ అభయ్ వర్మ ఉన్నారు.  

మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 

Also Read :  వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు