/rtv/media/media_files/2025/12/16/ipl-mini-auctions-2025-12-16-16-07-10.jpg)
ఐపీఎల్ 2026 మినీ వేలం జరగుతోంది. అబుదాబిలో ఫ్రాంఛైజీలు అన్నీ పోటీపడి ప్లేయర్లను దక్కించుకుంటున్నాయి. ఈ మినీ వేలంలిస్ట్ లో 19 మంది కొత్త ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్‌లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని బీసీసీఐ చెబుతోంది. ఈరోజు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
భారీ ధరకు కామెరూన్..
అందరూ అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలో భారీ ధర పలికాడు. ఇతని కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది. గ్రీన్ దక్కించుకోవడానికి కోలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. మధ్యలో సీఎస్కే కూడా జాయిన్ అయింది. చివరకు కోలకత్తా గ్రీన్ ను రూ.25.20 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. గ్రీన్ తర్వాత శ్రీలంక క్రికెటర్ పతిరన ఈ సారి ఐపీఎల్ లో అత్యధర పలికాడు. ఇతనిని కూడా కేకేఆరే దక్కించుకుంది. రూ. 18 కోట్లు వెచ్చింది పతిరనను కొనుగోలు చేసింది. అంతకుముందు ఇదే కేకేఆర్ 2024లో మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో కామెరూన్ గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. అంతకు ముందు రిషభ్ పంత్ రూ.27 కోట్లు, LSG, శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
25.20 Crore for Cameron Green.
— Rupees (@rupeesmedia) December 16, 2025
18 Crore for Matheesha Pathirana.
TWO BIG BUY FOR KOLKATA KNIGHT RIDERS...!!!!
#IPL2026Auction#IPLAuctionpic.twitter.com/seDqzafaSF
చాలా మంది అన్ సోల్డ్ గా..
ఇక ఇప్పటి ఐపీఎల్ వేలంలో మిగతా ప్లేయర్ల విషయానికి వస్తే..ఇప్పటి వరకు సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను అతని కనీస ధర రూ.2 కోట్లకు డిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. వెంకటేశ్ అయ్యర్ కూడా అదే రూ2 కోట్లకు బెంగళూరు కొనక్కుంది. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ డికాక్ రూ. కోటికి ముంబై ఇండియన్స్, ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ను రూ. 2 కోట్లకు ఢిల్లీ, కీవీస్ ప్లేయర్ ఫిన్ అలెన్ ను రూ. 2 కోట్లకు కేకేఆర్ , శ్రీలంక ప్లేర్ వానిందు హసరంగను రూ. కోట్లకు లక్నోలు సొంతం చేసుకున్నాయి. బేస్ ధర రూ.2 కోట్లతో వేలంలో నిలిచిన డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్) ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. అలాగే బారత క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ లను కూడా ఎవరూ కొనడానికి ఆసక్తి చూపలేదు.
Follow Us