IPL 2025 : ఐపీఎల్ రూల్స్ పై బీసీసీఐ కీలక నిర్ణయం

ఐపీఎల్ లోని కొన్ని రూల్స్ పై బీసీసీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. అంతేకాకుండా ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చునని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి బీసీసీఐ ఈ రూల్ తీసుకువచ్చింది.

New Update
ipl 2025 rules

ఐపీఎల్ లోని కొన్ని రూల్స్ పై బీసీసీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.  సలైవాపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చునని తెలిపింది.  బంతిని రివర్స్‌ స్వింగ్‌ చేసే క్రమంలో పేసర్లు ఉమ్మిని బంతికి రాస్తుంటారు. కరోనా సమయం నుంచి దీనిపై ఐపీఎల్‌తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో నిషేధం విధించారు. తాజాగా ఈ నిషేధాన్ని తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. శనివారం ప్రారంభమయ్యే లీగ్‌కు ముందు ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  అలాగే  సెంకడ్ ఇన్నింగ్స్ లో రెండు బంతులు వాడుకోవచ్చునని తెలిపింది.  అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను యథావిధిగా  కొనసాగించింది.  దీనిని బీసీసీఐ ఇప్పటికే 2027 వరకు పొడిగించింది. 

Also read :  ముస్కాన్ కంటే డేంజర్ ... ప్రియుడితో కలిసి భర్తను లేపేసి సంచిలో

Also read :   ధనశ్రీ వర్మకు రూ.  4.75 కోట్లు భరణం.. ఇంతకీ చాహల్ ఆస్తులెంత?

Advertisment
తాజా కథనాలు