ముస్కాన్ కంటే డేంజర్ ... ప్రియుడితో కలిసి భర్తను లేపేసి సంచిలో

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన హత్య కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన మరిచిపోకముందే జైపూర్‌లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.  ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపి, అతని మృతదేహాన్ని గోనె సంచిలో వేసి నిప్పంటించింది.  

New Update
Jharkhand women

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన హత్య కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.  ముస్కాన్ అనే వివాహిత తన లవర్ సాహిల్‌తో కలిసి తన భర్త సౌరభ్‌ను దారుణంగా హత్య చేసి, అతని మృతదేహాన్ని డ్రమ్‌లో ముక్కలుగా చేసి సిమెంట్ తో నింపింది. ఈ ఘటన మరిచిపోకముందే జైపూర్‌లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.  ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపి, అతని మృతదేహాన్ని గోనె సంచిలో వేసి నిప్పంటించింది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధన్నాలాల్ సైనీ కూరగాయలు అమ్ముతాడు. అతని భార్యకు గోపాలి దేవి (42)కి  దీనదయాళ్ (30)  అనే వ్యాపారితో చాలా కాలంగా అక్రమ సంబంధం ఉంది. దీనదయాళ్  షాపులోనే ఆమె పనిచేస్తుంది.  అక్రమ సంబంధం విషయం ధన్నాలాల్ కు తెలియడంతో మార్చి 15న  దీన్‌దయాళ్ షాపుకు  వెళ్లి గొడవ పడ్దాడు ధన్నాలాల్ . అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. గోపాలి , దీనదయాళ్ కలిసి అతనిపై తీవ్రంగా దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు.  

Also read :  చాహాల్, ధనశ్రీ వర్మ లకు విడాకులు మంజూరు!

దాదాపు 7 కి.మీ దూరం తీసుకెళ్లి

హత్య తరువాత ధన్నాలాల్ మృతదేహాన్ని  మాయం చేసేందుకు  ఒక  సంచిలో కుక్కి బైక్‌పై దాదాపు 7 కి.మీ దూరం తీసుకెళ్లారు.  ధన్నాలాల్ గుర్తింపును దాచడానికి , ఆధారాలను నాశనం చేయడానికి మృతదేహానికి నిప్పంటించారు.మరుసటి రోజు ఉదయం స్థానికులు కాలిపోయిన మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే  అక్కడికి చేరుకుని మృతుడిని ధన్నాలాల్ సైనీగా గుర్తించారు. 

ఆ తర్వాత ప్రేమికుడితో కలిసి జైపూర్ నుంచి పారిపోవడానికి గోపాలి పథకం వేసింది. అయితే పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. గోపాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె నేరాన్ని ఒప్పుకుంది. ప్రియుడు దీన్‌దయాళ్‌తో కలిసి ఈ హత్య చేశానని తెలిపింది. నిందితులను మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు పోలీసులు. వారిద్దరిపై హత్య కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన జైపూర్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also read :  రెండేళ్లుగా ముట్టుకోనివ్వట్లేదు సార్.. భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు