/rtv/media/media_files/2025/03/19/h55YajUwlMS8IcIJdbvF.jpg)
IPL 2025 opening ceremony at Eden Gardens, Kolkata
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. 18వ సీజన్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా జట్లు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 22 నుంచి మొదలు కానున్న ఈ ఐపీఎల్ 2025 సీజన్ మే 25 వరకు కొనసాగనుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్- vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలు కానుంది.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
బాలీవుడ్ స్టార్స్
ఈ నేపథ్యంలో తొలిరోజు అంగరంగ వైభవంగా ఈ సీజన్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభోత్సవ ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ నటీ నటులు మెరవబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
అందుతున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, విక్కీ కౌశల్ వంటి స్టార్ హీరోలు ఈ ఈవెంట్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో సంగీత ప్రదర్శన కోసం అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ సందడి చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ, శ్రద్ధా కపూర్‌తో పాటు వరుణ్ ధావన్‌లతో స్పెషల్ డ్యాన్స్ షో నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
🔥 Disha Patani Set to Light Up IPL 2025 Opening Ceremony! 🔥
— Akaran.A (@Akaran_1) March 19, 2025
- Bollywood star Disha Patani will set the stage on fire with her electrifying performance at the IPL 2025 opening ceremony! 🎤💃✨#IPL2025#OpeningCeremony#DishaPatani#CricketFestivalpic.twitter.com/xbki3bWv2p
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
అలాగే బాలీవుడ్ స్టార్లతో పాటు పంజాబ్ స్టార్ ర్యాపర్ కరణ్ ఔజ్లా సైతం ఈ ఈవెంట్‌లో హుషారెత్తించేందుకు హాజరు కానున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ ప్రదర్శన కోసం కూడా వారిని అప్రోచ్ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చూడాలి మొదటి రోజు హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో. మార్చి 22 తర్వాత రోజున అంటే మార్చి 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ సన్‌రైజర్స్ vs- రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.