పంత్ దెబ్బకు ఐపీఎల్ వేలం రికార్డ్స్ బద్ధలు.. రూ.30 కోట్లకు! ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డులు బద్ధలు కాబోతున్నట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్లు పంత్, శ్రేయస్, కేఎల్ రాహుల్‌కు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్ రూ. 25 నుంచి రూ. 30 కోట్లు పలికే అవకాశం ఉందని సురేష్ రైనా చెప్పారు. By srinivas 24 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి IPL 2025: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2025 మెగా వేలంలో రికార్డులు బద్ధలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆది, సోమవారాల్లో ఈ మెగా వేలం జరగనుండగా.. 577 మంది ఆటగాళ్లు పోటీలో నిలవగా 210 ప్లేయర్స్ కోసం 10 ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. భారత ఆటగాళ్లు 367, వీదేశీ ప్లేయర్స్ 210 మంది ఉన్నారు. ఇక కనీస ధర రూ.2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లుండగా.. పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లకు భారీ డిమాండ్ ఉంది. ɪᴛ’ꜱ ᴀʟᴍᴏꜱᴛ ᴛɪᴍᴇ ꜰᴏʀ ᴛʜᴇ #ᴛᴀᴛᴀɪᴘʟ ᴍᴇɢᴀ ᴀᴜᴄᴛɪᴏɴ 2025 🔨 #TATAIPLAuction pic.twitter.com/TUvPp1L5Uv — IndianPremierLeague (@IPL) November 24, 2024 పంత్ కోసం పోటీ.. అయితే సీజన్-18 మెగా వేలంలో రిషబ్ పంత్ రికార్డు ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని మాజీలు చెబుతున్నారు. పంత్ 25 నుంచి 30 కోట్లు పలికే అవకాశం ఉందని సురేశ్ రైనా జోస్యం చెప్పాడు. అయితే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడడానికి ఇష్టపడకపోవడంతో కొత్త ఫ్రాంఛైజీ భారీ ధర పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నిజంగా పంత్ 30 కోట్లు పలికితే భారత తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ముంబై దగ్గర 45 కోట్లు, చెన్నై దగ్గర 55 కోట్లు ఉండటంతో పంతో కోసం ఈ రెండు పెద్దగా పోటీ పడకపోవచ్చు. పంత్ కోసం పంజాబ్ కింగ్స్, బెంగళూరు పోటీ పడే అవకాశ ఉంది. ఇది కూడా చదవండి: పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏ క్షణమైనా అరెస్టు!? ఇక ఫ్రాంఛైజీలను ఆకర్షించే జాబితాలో అర్ష్‌దీప్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఉండగా అర్ష్‌దీప్ సింగ్ కోసం ఫ్రాంఛైజీలు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక 2025 ఐపీఎల్ మార్చి 14న మొదలై మే 25న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ఇది కూడా చదవండి: Samantha: చైతూ కోసం సమంత కాస్ట్లీ గిఫ్టులు.. అవేంటో తెలుసా? #ipl-2025 #rishab-pant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి