/rtv/media/media_files/2024/11/24/P4kLVIsIAZLQqISyBczE.jpg)
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల 'సిటాడెల్ : హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి నటించింది సామ్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో స్ట్రీమింగ్ చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.
అవసరం లేకపోయినా కొన్నా..
కాగా ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత.. వరుణ్ ధావన్ తో కలిసి సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో..' అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?' అని వరుణ్ ధావన్ ప్రశ్నించగా..' నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకులు' అని సమంత బదులిచ్చింది.
"My EX's Expensive Gifts."#Samantha with #VarunDhawan during #CitadelHoneyBunny promotions.
— Gulte (@GulteOfficial) November 24, 2024
vc @PrimeVideoINpic.twitter.com/v9ossd274G
Also Read : ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
అనంతరం వాటి 'ధర ఎంత ఉంటుంది?' అని అడగ్గా..'కాస్త ఎక్కువే..' అని సామ్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ చూసిన నెటిజన్స్ చైతూ కోసం సమంత ఎలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ కొని ఉంటుంది? అంటూ దీని గురించే చర్చించుకుంటున్నారు.
సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివాహ బంధం ఎంతో కాలం నిలవలేదు. 2017 లో చైతూను మ్యారేజ్ చేసుకున్న సామ్..కేవలం నాలుగేళ్లకే అతనితో విడాకులు తీసుకుంది. 2021 లో ఈ జంటకు డివోర్స్ అయింది. ఆ తర్వాత నుంచి సమంత సినిమాలు చేస్తూ బిజీ అయింది. మధ్యలో మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Follow Us