KKR Vs LSG: రహానె రాణించినా.. ఉత్కంఠ పోరులో పంత్ దే పైచేయి!

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లఖ్‌ నవూ నిర్దేశించిన 239 పరుగుల చేధించలేక కేకేఆర్ చతికిలపడింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించినా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది.

New Update
lsg kkr

IPL 2025 Lucknow Supergiants win against Kolkata Knight Riders

KKR Vs LSG: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లఖ్‌ నవూ నిర్దేశించిన 239 పరుగుల చేధించలేక కేకేఆర్ చతికిలపడింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించినా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది.

ఒపెనర్ల విధ్వంసం..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్‌ (81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) నాలుగో అర్ధ శతకం చేశాడు. నికోలస్ పూరన్ (87*; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. మార్‌క్రమ్ (47; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ తీశారు. 

ఇక కోల్‌కతా ఓపెనర్లు డికాక్‌ 15(9), సునీల్‌ నరైన్‌ 30 (13) ధాటిగా ఆరంభించారు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కెప్టెన్‌ రహానె 61 (35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్‌ అయ్యర్‌ 45 (29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కానీ రమణదీప్‌ సింగ్‌ (1), రఘువంశీ (5), రస్సెల్‌ (7) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. రింకూ సింగ్‌ 38 (15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత్‌ రాణా 10 (9 బంతుల్లో 2 ఫోర్లు) చివరిలో మెరుపులు మెరిపించిన ఫలితం లేకుండా పోయింది. లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో 2 వికెట్లు తీయగా, అవేశ్‌ఖాన్‌, దిగ్వేష్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

IPL 2025 | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు