IPL 2025: పంత్ పీకిందేమీ లేదు.. గొయెంకా వెంటనే ఆ పని చేయండి: హర్భజన్ కీలక సూచన!

లఖ్‌నవూ వరుస సరాజయాలపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా లఖ్‌నవూ అత్యధిక ధరకు దక్కించుకున్న రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గొయోంక ఏదో ఒక మార్పు చేయాలని సూచించాడు.

New Update
ipl 2025 bajji

Harbhajan Singh shocking comments on Rishabh Pant

IPL 2025: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వరుస సరాజయాలపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు ముఖ్యంగా లఖ్‌నవూ అత్యధిక ధరకు దక్కించుకున్న రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలతోపాటు బ్యాటింగ్, కీపింగ్ అంశంలోనూ సరైన ప్రదర్శన చేయట్లేదంటూ ఫైర్ అవుతున్నాడు. 

కేవలం 17 పరుగులే..

ఈ మేరకు పంత్‌ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేయగా తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో 15, 2 పరుగులు చేశాడు. దీంతో పంత్ ఫర్ఫార్మెన్స్ తనకు ఆందోళన కలిగిస్తోందన్నాడు భజ్జీ. లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే యాజమాన్యం వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలని సూచించాడు. ‘పంత్‌ ఇప్పటికి చేసిందేమీ లేదు. బ్యాట్‌తో రాణించలేదు. పేలవ ఫామ్‌ను అధిగమించేందుకు జట్టు యాజమాన్యం సహాయం చేయాలి. లేదంటే జట్టు ఇబ్బందులో పడుతుంది' అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. 

ఇక ఐపీఎల్‌-18 సీజన్ లో భాగంగా నేడు ముంబై, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గత మ్యాచ్‌లో గెలిచిన ముంబై విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది. పంత్ టీమ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. ముంబై మాజీ కెప్టెన్‌ రోహిత్‌శర్మ, లఖ్‌నవూ సారథి రిషబ్‌ పంత్‌ పైనే అందరి దృష్టి ఉంది. 

rishabh-pant | harbhajan-singh | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు