Tanmay Srivastava: అప్పుడు అండర్ 19 ఫైనల్లో హీరో.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్‌

మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విరాట్ కోహ్లీతో అండర్ 19లో తన్మయ్ రాణించాడు. ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు.

New Update
Tanmay Srivastava

Tanmay Srivastava Photograph: (Tanmay Srivastava)

Tanmay Srivastava: క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ కీలక పాత్ర పోషిస్తాడు. మ్యాచ్‌లో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాడు. అయితే మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్‌గా నిర్వహించనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ తెలిపింది. ఐపీఎల్‌లో ఆడిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

విరాట్‌ కోహ్లీతో అండర్ 19లో ఆడి..

విరాట్ కోహ్లీతో అండర్ 19 లో రాణించాడు. 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.  శ్రీవాస్తవ ఉత్తర ప్రదేశ్ తరఫున,  ఐపీఎల్ 2008, 2009 సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. దానితో తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు ఐపీఎల్ 2025లో అంపైర్‌గా వ్యవహరించనున్నాడు.

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

అతను ఐపీఎల్‌లో ఆటగాడిగా ఆడి, ఇప్పుడు అంపైర్‌గా మారిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానం వీడాలనుకోడని, ఇక్కడ అతడి పాత్ర మాత్రమే మారిందని తెలుపుతూ.. తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్‌ ది బెస్ట్ అంటూ రాసుకొచ్చింది.

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు