IPL 2025: CSK Vs MI మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్.. చెన్నై బౌలర్ వీడియో వైరల్!

ఆదివారం చెన్నై-ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ జేబులోనుంచి ఏదో తీసి కెప్టెన్ రుతురాజ్ కు ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఫిక్సర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

New Update
ball tmprng

IPL 2025 CSK Vs MI match ball tampering Allegations

IPL 2025: ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ సమిష్టి ప్రదర్శన చేసిన చెన్నై టోర్నీలో శుభారంభం చేసింది. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఈ మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎస్ కే బౌలర్ ఖలీల్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్‌తో అతని సంభాషణనకు సంబంధించిన వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలీల్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే.. 

ఖలీల్ బౌలింగ్ చేస్తున్నపుడు ఒక చేతిలో బంతి పట్టుకుని మరో చేతిని జేబులో పెట్టాడు. వెంటనే జేబులోనుంచి ఏదో లాగుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత ఆ వస్తువును తన దగ్గరకు వచ్చిన కెప్టెన్ రుతురాజ్‌కు పాస్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంగా ఇద్దరూ బాల్ ట్యాంపరింగ్ చేశారని ముంబై ఫ్యాన్స్ ఆరోపించారు. ఈ మేరకు 2016-2017లో జట్టు యజమాని బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఫ్రాంచైజీ ఎదుర్కొన్న రెండేళ్ల నిషేధాన్ని గుర్తు చేస్తూ కెవిన్ అనే వినియోగదారుడు ఫ్రాంచైజీని మరోసారి నిషేధించాలని డిమాండ్ చేశారు.

చిదంబరం స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కూడా వెంట వెంటనే వికెట్లను పొగొట్టుకుంది. తిలక్ వర్మ, శివమ్ దూబే సింగిల్ డిజిట్లకే పెవిలియన్ బాట పట్టారు. అయితే వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం దూకుడుగా ఆడుతూ జట్టును ముందు నడిపించాడు.  కేవలం 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది..జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ 53 పరుగుల దగ్గర రుతురాజ్ అవుట్ అయ్యాడు. ఇతని తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్ లో అర్ధశతకాన్ని కొట్టాడు. 42 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

అయితే మరోవైపు బ్యాటర్లు వరుసగా వికెట్లు పోగొట్టుకోవడంతో ఆట నెమ్మదించింది. చివరకు వచ్చేసరికి చెన్నై బ్యాటర్లు ఆచి తూచి ఆడడం మొదలుపెట్టారు. దీని వలన మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. చివర్లో తొమ్మది బంతుల్లో నాలుగు రన్స్ సాధించాల్సిన సమయంలో కూడా జడేజా వికెట్ ను కోల్పోయింది చెన్నై. దీంతో మ్యాచ్ ను గెలిపించడానికి ధోనీ క్రీజులోకి వచ్చాడు. చివర్లో రచిన్ రవీంద్ర సిక్స్ కొట్టడంతో సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 

 CSK vs MI | chennai | ipl-2025 | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు