U19 T20 World cup: అండర్ 19 వరల్డ్‌ కప్‌ మనదే.. అదరగొట్టిన గొంగడి త్రిష!

మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌ కప్‌ భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇండియా వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

New Update
u19 world cup

India won Women's Under-19 T20 World Cup

U19 T20 World cup: మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష (44*, 3/15) ఆల్‌రౌండ్‌ షోతో ఔరా అనిపించింది. సిరీస్‌ మొత్తంలో 300పైగా పరుగులు, ఏడు వికెట్లు తీసింది త్రిష. 

దక్షిణాఫ్రికాపై అటాక్.. 

టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఆ టీమ్ లో వాన్‌ వూరస్ట్ (23) టాప్‌ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ పడగొట్టారు.సేమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్‌పై 9వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించి ఇప్పుడు అజేయంగా నిలిచింది.

భారత్
కమలిని (వికెట్ కీపర్), గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత వీజే, షబ్నమ్ షకిల్, పరుణిక సిసోదియా, వైష్ణవి శర్మ

దక్షిణాఫ్రికా: 
జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డైరా రమ్లాకన్, ఫే కౌలింగ్‌, కౌలా రేనెకె (కెప్టెన్), కరాబో మెసో (వికెట్ కీపర్), మీకే వాన్ వూరస్ట్‌, సెష్నీ నాయుడు, ఆష్లే వాన్‌ విక్, మోనాలిసా లెగోడి, నిని




                                                
                                            
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు