Asia Cup Finals: ఆసియా కప్ మనదే..పాకిస్తాన్ మట్టి కరిపించిన టీమ్ ఇండియా

మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు.  భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబేలు నిలబడి మరీ మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది. 

New Update
india won

మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు.  భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబేలు నిలబడి మరీ మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది. ఫైనల్స్ లో తిలక్ వర్మ విజృంభించేశాడు. వరుసగా వికెట్లు పడిపోతున్న వేళ పిల్లర్ లా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు.  తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. జీవిత కాల ఇన్నింగ్స్ తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.  మొత్తానికి ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6),శివమ్ దూబె (33; 22 బంతుల్లో 2×4, 2×6) పరుగులు చేశారు.  


తక్కువ పరుగులకే...

ఆసియా కప్ ఫైనల్ లో ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దాదాపు 41 ఏళ్ళ తర్వాత ఈ రెండు టీమ్ లూ ఫైనల్ లో తలపడుతున్నాయి. దీంతో మ్యాచ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.  టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో పీల్డింగ్ లోకి వచ్చిన పాక్ ఓపెనర్లు పర్హాన్, ఫకర్ లు శుభారంభం ఇచ్చారు. వేగంగా పరుగులు చేస్తూ..స్కోరు బోర్డును పెంచారు. దీంతో పాకిస్తాన్ జట్టు బారత్ కు పెద్ద టార్గెట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ పదో ఓవర్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. మొదట ఫర్హాన్ వికెట్ తీయడంతో మొదలై...వరుసగా వికెట్లు తీస్తూ పోయారు. దీంతో పాకిస్తాన్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు.  పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 57 పరుగులు చేశాడు.  దాని తరువాత వరుసగా పాక్ బ్యాటర్లు విఫలం అవడంతో భారత్ టార్గెట్ 147 పరుగులకు పరిమితం అయింది. కుల్‌దీప్‌ (4/30), అక్షర్‌ పటేల్‌ (2/26), వరుణ్‌ చక్రవర్తి (2/30) అద్భుత బౌలింగ్ తో భారత్‌  పాకిస్థాన్‌ను 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

Advertisment
తాజా కథనాలు