/rtv/media/media_files/2025/09/10/india-vs-uae-2025-09-10-22-22-50.jpg)
ఆసియా కప్ 2025లో భారత టీమ్ శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేసి ఆలైట్ అయింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమమ్ ఇండియా కేవలం ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ కు వచ్చారు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 3 సిక్సులు, 2 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ 20*(9 బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు) లతో చెలరేగారు. 3.5 ఓవర్ లో అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ కాగా..కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బరిలోకి దిగి 7 పరుగులతో మ్యాచ్ ను గెలిపించాడు. కేవలం 4.3 ఓవర్లలో యూఏఈ ఇచ్చిన టార్గెట్ ను కొట్టేశారు. భారత్ తన తర్వాత మ్యాచ్ ను ఈ నెల 14న పాకిస్తాన్ తో ఆడుతుంది.
India records the biggest win (in terms of balls remaining) in Asia Cup's history!#AsiaCup2025 Highlights ⬇️https://t.co/nEUT9PF6otpic.twitter.com/uCDoPanRUC
— Sportstar (@sportstarweb) September 10, 2025
విజృంభించిన బౌలర్లు..
మొదట బ్యాటింగ్ కు దిగిన యూఏఈ జట్టులో ఓపెనర్ అలీషాన్ షరాఫు 22 ఒక్కడే కాస్త ఆడాడు. కెప్టెన్ మహమ్మద్ వసీమ్ 19 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే ఔట్ అయిపోయారు. మొదటి మూడు ఓవర్లు దూకుడుగా ఆడిన యూఏఈ బ్యాటర్లు.. ఆ తర్వాత భారత్ బౌలింగ్ ధాటికి చేతులెత్తేశారు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించాడు. శివమ్ దూబె మూడు, బుమ్రా, అక్షర్‌పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.