IND vs ENG: ఐదో టెస్ట్‌కు పంత్ స్థానంలో అతడే - బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కుద్ది

రిషబ్ పంత్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే 5వ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ ఎన్. జగదీశన్‌ను జట్టులోకి తీసుకున్నారు. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. జగదీశన్‌కు ఇది తొలి టెస్టు పిలుపు.

New Update
Narayan Jagadeesan Rishabh Pant replacement for the 5th Test against England

Narayan Jagadeesan Rishabh Pant replacement for the 5th Test against England

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన సమయంలో కాలివేలికి గాయం అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ చేసి అందరి హృదయాలను దోచుకున్నాడు. మొత్తంగా టీమిండియా నాలుగో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 

ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

ఈ క్రమంలో ఐదో టెస్ట్‌కు పంత్ దూరం అయ్యాడనే చేదు వార్తను బీసీసీఐ తెలిపింది. దీంతో అతడి స్థానంలో ఎవరు ఆడతారు అనేది అందరిలోనూ ఆసక్తికంగా మారింది. ఈ నేపథ్యంలో పంత్ ఐదో టెస్ట్‌లో ఆడటం లేదు అని ప్రకటిస్తూనే.. అతడి స్థానంలో మరొక ప్లేయర్ దిగుతున్నాడని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు అతడి పేరును కూడా అనౌన్స్ చేసింది.

తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ & బ్యాట్స్‌మన్ నారాయణ్ జగదీశన్‌ ను పంత్ స్థానంలో ఆడిస్తున్నట్లు తెలిపింది. దీంతో అతడి గురించి తెలుసుకోవడానికి క్రికెట్ ప్రియులు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు అతడి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

అతడి పేరు నారాయణ్ జగదీశన్‌. తమిళనాడుకు చెందిన అతడు వికెట్ కీపర్‌గా అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గా పేరు సంపాదించుకున్నాడు. తొలిసారిగా పంత్ స్థానంలో అతనికి టీమ్ ఇండియాలో అవకాశం లభించింది. ఇటీవలే జగదీశన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన చివరి మ్యాచ్‌లో 81 పరుగులతో విజృంభించాడు. 

ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

నారాయణ్ జగదీశన్‌ కెరీర్

కాగా నారాయణ్ జగదీశన్‌ ఇప్పటి వరకు భారతదేశం తరపున ఏ ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేయలేదు. అయితే అతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటివరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 47.50 సగటుతో 3373 పరుగులు చేశాడు. 10 సెంచరీలతో పాటు, అతను 14 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. దీనితో పాటు అతను 64 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 46.23 సగటుతో 2728 పరుగులు చేశాడు. ఈ సమయంలో 9 సెంచరీలతో పాటు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. అదే సమయంలో అతను 66 టి20 మ్యాచ్‌లలో 31.38 సగటుతో 1475 పరుగులు చేశాడు. 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు