/rtv/media/media_files/2025/09/28/india-vs-pakistan-asia-cup-2025-final-after-41-years-2025-09-28-18-14-40.jpg)
India Vs Pakistan Asia Cup 2025 Final After 41 Years
యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభఘట్టం రానే వచ్చింది. నేడు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ పోరులో భారత్ vs పాకిస్తాన్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడబోతున్నాయి. రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి.
India Vs Pakistan Asia Cup 2025 Final
1984లో తొలిసారిగా ఆసియా కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ ఆసియా కప్‌లో కేవలం మూడు జట్లు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక) మాత్రమే పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగింది. అంటే ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. ఇందులో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి.. చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి టోర్నమెంట్ విజేతగా నిలిచింది.
అయితే ఈ టోర్నమెంట్‌లో ‘‘ఫైనల్’’ మ్యాచ్ అనే పద్ధతి లేదు. చివరి రౌండ్-రాబిన్ మ్యాచ్ (భారత్ vs పాకిస్తాన్) టైటిల్ నిర్ణయాత్మక పోరుగా మారింది. ఆ కోణంలో చూస్తే.. మళ్లీ టైటిల్ కోసం దాయాదులు తలపడడానికి 41 ఏళ్లు పట్టింది. ఆసియా కప్ చరిత్రలో.. టోర్నమెంట్ ఫార్మాట్‌లో అధికారిక ఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ తలపడటం ఇదే మొదటిసారి. ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టంగా చెప్పవచ్చు. ఈ అరుదైన అవకాశం రావడంతో ఇరు దేశాల అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లలో (ట్రై-సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్లు కలుపుకొని) భారత్-పాకిస్తాన్ జట్లు 10 సార్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఆసియా కప్‌లో మాత్రం ఈ చారిత్రక పోరు ఇప్పుడే మొదలవుతోంది.
ఆసియా కప్ ఫైనల్స్ (ODI, T20I) లిస్ట్
1984 : భారత్ (విజేత) రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో శ్రీలంక (రన్నరప్)ను ఓడించింది (ఫైనల్ మ్యాచ్ లేదు).
1986 : శ్రీలంక (విజేత) పాకిస్తాన్ (రన్నరప్) పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
1988 : భారత్ (విజేత) శ్రీలంక (రన్నరప్) పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
1990/91: భారత్ (విజేత) శ్రీలంక (రన్నరప్) పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
1995 : భారత్ (విజేత) శ్రీలంక (రన్నరప్) పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
1997 : శ్రీలంక (విజేత) 8 వికెట్ల తేడాతో భారత్ (రన్నరప్)ను ఓడించింది.
2000 : పాకిస్తాన్ (విజేత) శ్రీలంక (రన్నరప్) పై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2004 : శ్రీలంక (విజేత) 25 పరుగుల తేడాతో భారత్ (రన్నరప్)ను ఓడించింది.
2008 : శ్రీలంక (విజేత) భారత్ (రన్నరప్) పై 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2010 : భారత్ (విజేత) శ్రీలంక (రన్నరప్) పై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2012 : పాకిస్తాన్ (విజేత) బంగ్లాదేశ్ (రన్నరప్) పై 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2014 : శ్రీలంక (విజేత) పాకిస్తాన్ (రన్నరప్) పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2016 (T20I ఫార్మాట్): భారత్ (విజేత) బంగ్లాదేశ్ (రన్నరప్) పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2018 : భారత్ (విజేత) బంగ్లాదేశ్ (రన్నరప్) ను 3 వికెట్ల తేడాతో ఓడించింది.
2022 (T20I ఫార్మాట్): శ్రీలంక (విజేత) పాకిస్తాన్ (రన్నరప్) పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2023 : భారత్ (విజేత) శ్రీలంక (రన్నరప్) పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారతదేశం : 8 టైటిల్స్
శ్రీలంక: 6 టైటిల్స్
పాకిస్తాన్: 2 టైటిల్స్