Team India - WTC: డబ్ల్యూటీసీ టేబుల్.. టాప్ ప్లేస్‌ కోల్పోయిన భారత్!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. సిరీస్‌ ముందు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 62.50 శాతంతో తొలి స్థానానికి చేరింది.

New Update
Team India – WTC

న్యూజిలాండ్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో టీమిండియా మొదట్లో అదరగొట్టేసింది. ఈ సిరీస్ ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు అంతా తారుమారు అయిపోయింది. మూడోసారి ఫైనల్‌కు చేరుకుందామనే ఆశలకు గండికొట్టేలా ఉంది. మొదట్లో చెలరేగిపోయిన టీమిండియా.. ఇప్పుడు 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. 

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

రెండో స్థానానికి భారత్

ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో మొదటి స్థానానికి చేరింది. అదే సమయంలో భారత్ 58.33 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో శ్రీలంక (55.56) శాతంతో ఉంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గిన కివీస్ 54.55 శాతంతో నాలుగో స్థానినిక చేరింది. ఆ తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా 54.17 శాతంతో కొనసాగుతోంది. 

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ఇక ఈ టోర్నీలో టీమిండియాకు సవాల్ ఎదురుకానుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో ఆసీస్‌తో 5 టెస్టుల్లో తలపడనుంది. డబ్ల్యూటీసి సైకిల్‌లో భారత్‌కు ఇదే ఆఖరి సిరీస్.

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ

ఈ సిరీస్‌లో కనీసం 4 టెస్టుల్లో టీమిండియా గెలవాలి. అలాగే మరొక దానికి డ్రాగా ముగించాలి. ఈ సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ ఓడినా.. ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

కేవలం 25 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-3 తేడాతో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే టీమిండియా స్వదేశంలో 3-0 తేడాతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఎప్పుడూ వదులుకోలేదు. ఇలా దాదాపు 24 ఏళ్ల తర్వాత భారత జట్టు స్వదేశంలో వైట్ వాష్‌కు గురికావడం అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు