India vs pakistan: రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

128 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన టీమ్ ఇండియా 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ 23 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 10 పరుగులు చేసారు.

New Update
match

ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 127పరుగులు చేసింది. దీని తర్వాత 128 పరుగుల లక్ష్యంతో భారత జట్టు క్రీజ్ లోకి వచ్చింది. శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. ఇందులో రెండో ఓవర్లో 10 పరుగుల దగ్గర గిల్ మొదటగా అవుట్ అయ్యాడు. దాని తరువాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. అయితే నాలుగో ఓవర్లో 41 పరుగుల దగ్గర అభిషేక్ శర్మ తన వికెట్ ను కోల్పోయాడు. భారత బ్యాటర్లు వేగంగా పరుగులు చేస్తున్నా వికెట్లు కూడా అంతే వేగంగా కోల్పోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇంకా చాలా మంది బ్యాటర్లు ఇంకా ఉండడం...టార్గెట్ చిన్నదే కావడ వల్లన భారత్ మ్యాచ్ ఈజీగానే గెలుస్తుందనే నమ్మకం ఉంది.

Advertisment
తాజా కథనాలు