Ind vs Eng: బ్యాటర్ల కష్టం వృధా..మొదటి టెస్ట్ లో భారత్ ఓటమి

బ్యాటర్ల కష్టం బౌలర్లు, ఫీలర్లు నేలపాలు చేశారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ ఓడిపోయింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

New Update
first test (1)

England vs India

లీడ్స్ లో జరుగుతున్న టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో మొదటి టెస్ట్ లో టీమ్ ఇండియా ఓడిపోయింది. టీమ్ఇండియా నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బెన్ డకెట్ 170 పరుగుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్ తో 149 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను గెలిపించాడు. జాక్ క్రాలీ 65, జో రూట్ 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేశారు. చివర్లో జేమీ స్మిత్  55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులతో దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో 21/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. తొలి సెషన్‌లో ఒక్క వికెట్టూ కోల్పోకుండా 96 పరుగులు చేసింది. రెండో సెషన లో 152 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు