బడ్జెట్ ఫుల్ వసతులు నిల్.. భారత్ పరువు తీస్తున్న బీసీసీఐ!

కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లా రెండో టెస్టు మ్యాచ్‌ ఒకరోజు వర్షానికే మూడు రోజులు ఆగిపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న బీసీసీఐ వసతులు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

New Update
ASWQ

BCCI : అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ బోర్ట్ అత్యంత రిచెస్ట్. కానీ వసతులు కల్పించడంలో మాత్రం చాలా పూర్. ముఖ్యంగా మైదానాలను చక్కదిద్దడంలో, క్రికెట్ లవర్స్ కు టికెట్స్, స్టేడియంలో సీట్ల శుభ్రత విషయంలో చాలా అలసత్వం ప్రదర్శి్స్తోంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ వర్షం పడకపోయినా రెండు రోజులు ఒక్క బంతి పడకుండానే నిలిచిపోయింది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గ్రౌండ్ తడిగా ఉండటంతో ఆటను నిలిపేశారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 

ఇప్పటికైనా కళ్లు తెరవండి..

ఈ మేరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ దేశాలు గ్రౌండ్ ఆరబెట్టేందుకు హెలికాప్టర్లు వాడుతుంటే.. బీసీసీఐ మాత్రం టేబుల్ ఫ్యాన్స్, ఐరన్ బాక్సులు, హెయిర్ డ్రైయర్ వాడటం విడ్డూరంగా ఉదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్ వాటిని తొలగించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. కాళ్లు దిగబడుతుండటంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటను కొనసాగించడం కష్టమని రద్దు చేశారు. దీంతో కోట్ల రూపాయాల ఆదాయం ఉన్న బీసీసీఐ బంగ్లా ముందు పరువు తీసిందంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి మైదానాలను ఆధునీకరించాలని సూచిస్తున్నారు.

ఈ మ్యాచ్‌ తొలి రోజు ఆట 55 ఓవర్లు మాత్రమే కొనసాగింది. రెండో రోజు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు చేశారు. మూడో రోజు వర్షం లేకపోయినా మైదానంలోని ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు.

Also Read :  మరోసారి తెలుగోడికే ఛాన్స్.. IPL పాలక మండలిలో చాముండేశ్వరీనాథ్‌కు చోటు

Advertisment
Advertisment
తాజా కథనాలు